ఈ రోడ్డు నుంచి సంగీతం వస్తుంది.. ఆ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే వీడియో
చాలా మందికి మ్యూజిక్ అంటే ప్రాణం. అందులోనూ పాటలు పెట్టుకుని డ్రైవ్ చేస్తుంటే అలుపు అనేదే ఉండదన్నది వాహనదారుల అభిప్రాయం. అందుకే కారు కొనేముందు మ్యూజిక్ సిస్టమ్ ఎంత నాణ్యతతో ఉందనే విషయాన్ని చూసుకుంటారు. అయితే హంగేరీ దేశంలోని ఆ మ్యూజికల్ రోడ్ పైకి వెళ్లేవారు తమ రేడియోలను బంద్ పెట్టేస్తుంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు వినిపించే పాట వాహనదారులకు వినోదం అందిస్తోంది. ఎక్స్‌లో ఇటీవల ఈ మ్యూజిక్ రోడ్ వీడియో వైరల్ గా మారింది.
ఈ రోడ్డుపై వాహనాలు నిర్దేశించిన వేగంతో వెళ్తే రోడ్డుపై సంగీతం వినిపిస్తుంది . ఈ మ్యూజిక్ రోడ్‌ను రోడ్ 37 అని పిలుస్తారు. ఈ రోడ్డు స్లొవేకియా సరిహద్దులోని ఫెల్సోజ్సోల్కా నుండి సటోరల్జౌజెలీ వెళ్లే రోడ్డులో ఈ మ్యూజిక్ వినిపిస్తుంది. కారు నిర్దేశిత వేగంతో వెళ్తుంటే స్థానికంగా ఉన్న రిపబ్లిక్ బ్యాండ్ జానపద గాయకులు పాడిన పాట ఈ రోడ్డు నుండి వినిపిస్తుంది. అయితే ఈ రోడ్డుపై కచ్చితంగా నిర్దేశించిన వేగంతోనే వెళ్లాలి. రెండేళ్ల క్రితం రోడ్డును నిర్మించారు. అప్పట్లోనే ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి పతాకశీర్షికలకు ఎక్కింది. ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుండి 15 మిలియన్ల కంటే ఎక్కువమంది చూడగా, లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక్కడి హైవేపై స్పీడ్ పరిమితి గంటకు 80 కిలో మీటర్లు. సరిగ్గా ఇదే వేగంతో వాహనం వెళ్తే రోడ్డు, టైర్ల మధ్య జరిగే ర్యాపిడితో ఈ సంగీతం వస్తుంది. డ్రైవర్ తన వాహనాన్ని కాస్త వేగం తగ్గించినా లేదా కాస్త వేగం పెంచినా ఈ రోడ్డుపై వచ్చే సంగీతం అసంపూర్ణంగా లేదా అసంబద్ధంగా వస్తుంది. మ్యూజిక్ రోడ్డు ప్రయోగాలను ఇతర దేశాలు కూడా చేశాయి. మొట్టమొదటి సంగీత రహదారిని డెన్మార్క్ లోని గిల్లింగ్ లో 1995లో నిర్మించారు. ఫ్రాన్స్‌లోని విల్ పింటే శివారులో 2000 సంవత్సరంలో మ్యూజిక్ రోడ్డును నిర్మించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
