ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ వింత సంప్రదాయం కొనసాగుతోంది. ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో దేరాసర్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో 600 మంది కంటే ఎక్కువగా జనాభా నివాసం ఉంటుంది. ఈ గ్రామంలో అనాదిగా వస్తున్న ఓ వింత సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ చిన్న గ్రామంలో ప్రతీ పురుషుడికి ఇద్దరు భార్యలు ఉంటారు.
పురుషులు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకునేది.. ఇష్టంతో కాదు.. ఇది ఆ గ్రామంలోని వింత ఆచారంలో భాగం.దేరాసర్‌లో దాదాపు 70 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇస్లాం మతంలో ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకోవడం చాలా సాధారణం. అయితే ఈ గ్రామంలో నివసించే హిందువులు కూడా తప్పనిసరిగా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ అసాధారణ సంప్రదాయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణం ఏమిటంటే.. ఈ గ్రామంలో ఒక పెళ్లి చేసుకున్న పురుషుడికి మొదటి భార్యతో పిల్లలు పుట్టరట. మొదటి భార్యకు కుమార్తె పుడుతుందట. అంటే మొదటి భార్య సాధారణంగా గర్భం దాల్చదని.. ఒకవేళ గర్భవతి అయినా ఆడపిల్ల పుడుతుందని నమ్మకం. అందుకనే తప్పని సరిగా రెండో పెళ్లి చేసుకుంటారు. ఇలా రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండవ భార్యకు కొడుకు పుడతాడని.. అలా ఆ వంశం కొనసాగుతుందని విశ్వాసం. ఇలాంటి నమ్మకం.. సంప్రదాయం సంవత్సరాలుగా కొనసాగుతూనే వస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
