పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
కుటుంబ సభ్యులకు విషపూరిత పుట్టగొడుగులతో వండిన ఆహారాన్ని తినిపించి, వారిలో ముగ్గురి మరణానికి కారణమైన కేసులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళను కోర్టు దోషిగా నిర్ధారించింది. మరొకరిపై హత్యాయత్నం చేసినట్టు కూడా తేల్చింది. 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్‌ను విక్టోరియా సుప్రీంకోర్టు జ్యూరీ సోమవారం దోషిగా ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే… 2023 జులైలో మెల్‌బోర్న్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని లియోన్‌గాథ పట్టణంలో ఉన్న తన నివాసంలో ఎరిన్ ప్యాటర్సన్ ఒక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు హాజరైన ఆమె భర్త తల్లిదండ్రులు డాన్, గేల్ ప్యాటర్సన్‌తో పాటు, గేల్ సోదరి హీథర్ విల్కిన్సన్ ఆ ఆహారం తిని కొద్దిరోజులకే మరణించారు. హీథర్ భర్త ఇయాన్ విల్కిన్సన్ తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో వారాలపాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు.దాదాపు 10 వారాల పాటు సాగిన విచారణలో ప్రాసిక్యూషన్ కీలక వాదనలు వినిపించింది. ఎరిన్ ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకరమైన ‘డెత్ క్యాప్’ పుట్టగొడుగులను సేకరించి, వాటిని ఎండబెట్టి, పొడిగా మార్చిందని ఆరోపించింది. ఆ పొడిని ‘బీఫ్ వెల్లింగ్‌టన్’ అనే వంటకంలో కలిపి అతిథులకు వడ్డించిందని జ్యూరీకి వివరించింది. అంతేకాకుండా, తనకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి వారిని విందుకు రప్పించిందని, అనుమానం రాకుండా ఉండేందుకు తనక్కూడా ఆ ఆహారం వల్ల అనారోగ్యం వచ్చినట్టు నటించిందని, పోలీసుల విచారణ మొదలవగానే సాక్ష్యాలను నాశనం చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఆ గుళ్లో అడుగుపెడితే.. మీ పెళ్లి అయినట్లే వీడియో
ఈ రోడ్డు నుంచి సంగీతం వస్తుంది.. ఆ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
