AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

Samatha J
|

Updated on: Jul 15, 2025 | 8:23 AM

Share

ఆసియాలోనే అత్యంత వృద్ధ ఆడ ఏనుగు కన్నుమూసింది. పన్నా టైగర్ రిజర్వ్‌కే గర్వకారణంగా నిలిచిన వత్సల అనే ఏనుగు తన వందేళ్ల తన జీవన ప్రస్థానానన్ని ముగించింది. అటవీ సిబ్బందిని, పర్యాటకులకు 'దాదీ మా'గా అలరించిన ఈ ఏనుగు.. ఆసియాలోనే అత్యంత వృద్ధ ఆడ ఏనుగుగా గుర్తింపు పొందింది. వయోభారంతో పాటు పలు అవయవాలు విఫలం కావడంతో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఈ ఏనుగు మరణంతో పన్నా అభయారణ్యంలో ఒక శకం ముగిసినట్లయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వత్సల, హినౌతా క్యాంపులో పశువైద్యుల పర్యవేక్షణలో ఉంది. వత్సల మరణవార్త తెలియగానే పీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచితా టిర్కీ, డిప్యూటీ డైరెక్టర్ మోహిత్ సూద్, వన్యప్రాణి వైద్యులు సంజీవ్ గుప్తా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్యాంపులోనే గౌరవప్రదంగా వత్సల ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు.ఈ ఏనుగు ప్రస్థానం కేరళలోని నీలంబూర్ అడవుల్లో ప్రారంభమైంది. అక్కడ కలప రవాణా పనులకు ఉపయోగపడిన వత్సలను, 1971లో మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌కు తీసుకొచ్చారు. సుమారు దశాబ్ద కాలం పాటు పులుల జాడను గుర్తించే బృందంలో కీలక పాత్ర పోషించి, వన్యప్రాణి సంరక్షణకు ఎంతగానో దోహదపడింది.

మరిన్ని వీడియోల కోసం :

మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో

పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో