ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు
ఓటీటీల జోరు కొనసాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి.

ఓటీటీల పుణ్యమా అని సినిమాల సందడి పెరిగిపోయింది. కేవలం తెలుగు బాషలోనే కాదు ఇతర బాషలనుంచి ఎలాంటి సినిమా వచ్చినా ప్రేక్షకులు వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఓటీటీలో సినిమాల హంగామా ఎక్కువైపోయింది. ప్రతివారం పదికి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే థ్రిల్లర్ జోనర్ లో చాలా సినిమాలు తెరకెక్కాయి. ఆడియన్స్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
బయపడుతూనైనా సరే థ్రిల్లర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూస్తే సుస్సు పడాల్సిందే.. ఓ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అమ్మాయిలను మాత్రమే అత్యంత కిరాతకంగా చంపే కిల్లర్ కథ. ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా. సీన్ సీన్ కు ఓ ట్విస్ట్ ఉంటుంది. టెన్షన్ తో నరాలు కట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా స్పై కామెడీ-థ్రిల్లర్.
ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్
ఈ సినిమాలో హీరోయిన్ తన కొడుకు, భర్తతో కలిసి ఓ సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. నిజానికి ఆమె ఓ స్పై ఏజెంట్.. 13 సంవత్సరాలుగా ఆమె ఓ సాధారణ యువతిగా జీవిస్తూ ఉంటుంది. ఆమె భర్త ఆడవాళ్లు ఇంట్లోనే ఉండాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎప్పుడూ తనను తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. కామన్ మ్యాన్ అనే కిల్లర్ మహిళలను చంపుతూ ఉంటాడు. కొంతమంది ఏజెంట్స్ కూడా కిల్లర్ చేతిలో చనిపోతారు. దాంతో హీరోయిన్ తిరిగి ఏజెంట్ గా మారుతుంది. అయితే ఆమె కిల్లర్ ను పట్టుకుందా.? అతను మహిళలను ఎందుకు చంపుతున్నాడు అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు మిసెస్ అండర్ కవర్.. ఈ సినిమాలో రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించింది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం జీ5 (Zee5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








