AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరమ చెత్త సినిమా..! రూ. 80కోట్లు పెడితే రూ.8 కోట్లు కూడా రాలేదు.. కానీ ఆ పాట దేశాన్నే ఊపేసింది

ఒక సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అవుతాయి. సినిమా ముందు చేసే ప్రమోషన్స్, హడావిడి ఆ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తాయి.. కానీ కొన్ని సినిమాలు విడుదల తర్వాత దారుణంగా నిరాశపరుస్తాయి. భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

పరమ చెత్త సినిమా..! రూ. 80కోట్లు పెడితే రూ.8 కోట్లు కూడా రాలేదు.. కానీ ఆ పాట దేశాన్నే ఊపేసింది
Movie
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2025 | 7:37 AM

Share

ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలు కూడా ఊహించని విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ అంచనాలు మధ్య విడుదలై దారుణంగా నిరాశపరుస్తున్నాయి. ఇప్పటికే భారీ హైప్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే ఈ సినిమా మాత్రం మరీ దారుణం.. రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ రిలీజ్ తర్వాత సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? మాములుగా సినిమాలు నిరాశపరిచిన అంతో ఎంతో వసూల్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం రూ.80 కోట్ల బడ్జెట్ తీస్తే.. రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన సినిమా రాలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా టాలీవుడ్ సినిమా కాదు. ఇది బాలీవుడ్ సినిమా. ఈ సినిమా పేరు ఆజాద్. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది. పైగా హీరో, హీరోయిన్ కూడా స్టార్ కిడ్స్. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ సోదరుడి కుమారుడు అమన్ దేవ్‌గన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

అలాగే హీరోయిన్‌గా రవీనా టాండన్ కూతురు రాషా తదాని డెబ్యూ చేసింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. రూ. 80కోట్లు  బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై హైప్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ రోజే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏం సినిమారా బాబూ..! జనాలు తలలు పట్టుకునేల చేసింది ఈ మూవీ. దాంతో ఈ సినిమా ఇండస్ట్రీ టాక్ గా మారింది. ఇక ఈ సినిమాలో ఉయ్ అమ్మా అనే సాంగ్ మాత్రం దేశాన్ని ఊపేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం