AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్నఈ ముద్దుగుమ్మ షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. ఇక ఈ అమ్మడు జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గింది. ఇంట్లోనే ఉండి బరువు తగ్గిన ఈ చిన్నది తన సీక్రెట్ రివీల్ చేసింది. హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2025 | 7:54 AM

Share

హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోయిన్స్ బరువు పెరగడం తగ్గడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్ గా జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. జిమ్ లో కఠినమైన కసరత్తులు చేసి ఎంతో ఫిట్ గా మారుతుంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల స్పీడ్ తగ్గించింది. ఇంతకూ జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..

బాలీవుడ్ అందాల తార విద్య బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే.. డర్టీ పిచ్చర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న విద్య బాలన్ తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

అడపదడపా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గాను అని చెప్పింది. జిమ్ కు వెళ్లడం మానేశా.. క్రమంగా బరువు తగ్గుతూ వచ్చా అనితెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో లావుగా ఉన్నావ్.. ఫిట్‌గా లేవు అనే విమర్శలు ఎదుర్కొన్నా.. జిమ్ కు వెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆతర్వాత ఓ ప్రముఖ న్యూట్రిషన్ గ్రూప్ సంప్రదిస్తే నేను లావు అయ్యింది ఫాట్ వల్ల కాదు అని తెలిసింది. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా నేను బరువు పెరిగాను అని తెలిసింది. దాంతో ఆ న్యూట్రిషన్ గ్రూప్ సలహాలు పాటించి బరువు తగ్గా..వ్యాయామం లేకుండా కేవలం డైటింగ్‌ ద్వారా బరువు తగ్గానని విద్యా చెప్పింది.ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుందని తెలిపింది విద్య.. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..