1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ
ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక హీరోయిన్స్ ఆస్తి పస్తులు కూడా కోట్లల్లో ఉంటాయి. వారు వాడే కార్లు, బట్టలు, ఉండే ఇళ్లు ఎంతో ఖరీదైనవిగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం ఎంతో సింపుల్ గా ఉంటారు. ఓ స్టార్ హీరోయిన్ కూడా కోట్ల కొద్దీ ఆస్తులున్నా ఇలా చిన్న కారులో తిరుగుతుంది.

హీరోలు, హీరోయిన్స్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. వేసుకునే బట్టలు , వాడే కార్లు, ఉండే బంగ్లాలు అన్ని చాల కాస్ట్లీగా ఉంటాయి.సెలబ్రెటీలు వాడే ఒక్క వాచ్ ధరతో ఓ సామాన్యుడు రిచ్ గా బ్రతికేయొచ్చు. అయితే కొంతమంది మాత్రం రిచ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే అప్పుడప్పుడు సింప్లీసిటీతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటుంటారు. ఎన్ని కోట్ల ఆస్తులున్నా కూడా కొంతమంది సింపుల్ గా జీవిస్తూ ఉంటారు. మొన్నామధ్య కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ చిన్న కారును వాడుతున్నారని వార్తలు వచ్చాయి. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా దర్శకుడు అయ్యుండి కూడా చిన్న కారులో తిరుగుతుండటం వైరల్ అయ్యింది. తాజాగా ఓ హీరోయిన్ కూడా కోట్లు ఉన్న కూడా ఎంతో సింపుల్ గా చిన్న కారులో తిరుగుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పై ఫోటోలు ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఈ అమ్మడు హిందీలో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తెలుగులోనూ నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహూ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. సాహో సినిమా భారీగా కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా హిందీలో ఓ సినిమా చేసింది. శ్రద్ధా కపూర్ రీసెంట్ గా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ. 900కోట్లు వసూల్ చేసింది.
15 ఏళ్ల సినిమా కెరీర్లో ఆషిఖీ-2, బాఘీ, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, స్త్రీ తదితర సినిమాల్లో నటించిన శ్రద్ధా.. సాహో సినిమాలో ప్రభాస్ సరసన మెరిసింది. కాగా శ్రద్ధా కపూర్‌కు మారుతి సుజికీ స్విఫ్ట్ కారును వాడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిజంగా శ్రద్ధా కపూర్‌కు మారుతి సుజికీ స్విఫ్ట్ కారును వాడుతోందా.? అని నెట్టింట చర్చ జరుగుతుంది. నెటిజన్స్ ఈ విషయం పై గూగుల్ లో గాలిస్తున్నారు. అలాగే ఆమె దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయన్నది కూడా ఆరా తీస్తున్నారు. కాగా శ్రద్ధా కపూర్‌కు మారుతి సుజికీ స్విఫ్ట్ కారుతోపాటు లాంబోర్గినితోపాటు రేంజ్‌రోవర్, మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన మూడు మోడళ్లు, ఆడి క్యూ7, టయోటా ఫార్చ్యునర్ కార్లు ఉన్నాయని గూగుల్ తెలుపుతుంది.
శ్రద్దా కపూర్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








