AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddu Jonnalagadda: కొత్త సినిమా అనౌన్స్ చేసిన స్టార్ బాయ్ సిద్దు.. టైటిల్ అదిరిపోయిందిగా..

‘డీజే టిల్లు’ సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రత్యేకంగా యూత్ మంచి క్రేుజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ తో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు సిద్దు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.

Siddu Jonnalagadda: కొత్త సినిమా అనౌన్స్ చేసిన స్టార్ బాయ్ సిద్దు.. టైటిల్ అదిరిపోయిందిగా..
Siddhu Jonnalagadda
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2025 | 12:49 PM

Share

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్‌ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు ‘బ్యాడాస్’ అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సిద్ధును మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సిద్ధు జొన్నలగడ్డ మంచి నటుడే కాకుండా, ప్రతిభగల రచయిత కూడా అనే విషయం తెలిసిందే. ‘బ్యాడాస్’ సినిమాకి రవికాంత్ పేరేపుతో పాటు సిద్ధు జొన్నలగడ్డ రచయితగా వ్యవహరిస్తున్నారు. రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

టిల్లు పాత్రతో వినోదాన్ని పంచి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు ‘బ్యాడాస్’లో కొత్తగా కనిపించబోతున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించడమే కాకుండా.. లోతైన మరియు పరిణతి చెందిన నటనతో మెప్పించబోతున్నారు.

ఇవి కూడా చదవండి

నిర్మాతలు టైటిల్ తో కూడిన అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. “If middle finger was a man” అనే బోల్డ్ స్టేట్మెంట్ తో ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజుల్లో సినిమాకి సంబంధించిన మొదటి కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకర్షించడం అంత సులభమైన విషయం కాదు. కానీ, ‘బ్యాడాస్’ చిత్ర బృందం మొదటి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, ప్రశంసలు అందుకుంటోంది.

బలమైన కథ, భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ‘బ్యాడాస్’ చిత్రం పరిమితులను అధిగమించి సంచలన విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎమోషనల్ డ్రామాలలో ఒకటిగా సిద్ధమవుతోంది. ‘బ్యాడాస్’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి ఘన విజయాల తర్వాత వారి నిర్మాణంలో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..