AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు : స్టార్ హీరో

తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ స్టార్ హీరో.. ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఆయన.. ఆ స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు జనాలు థియేటర్ కు క్యూ కడతారా.. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఇప్పుడు విలన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు : స్టార్ హీరో
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2025 | 12:13 PM

Share

ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఒకప్పుడు హీరోలుగా ఎదిగి.. ఇప్పుడు విలన్స్ గా, సైడ్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా అదే కోవకు చెందినవారే.. ఒకానొక టైం లో ఆయన సినిమా వస్తుందంటే చాలు పేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. లేడీస్ లో ఆయన ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా యిట్టె ఒదిగిపోయే ఆయన ఎవరో గుర్తుపట్టారా.? తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకూ ఆయన ఎవరు.? ఆయన చేసిన కామెంట్స్ ఏంటి..? ఒక్కసారి చూద్దాం.!

ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ ల్లో జగపతిబాబుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. “నా కూతురు ఎవరో విదేశీయుడిని పెళ్లి చేసుకుంటుందని కొంతమంది  నా కులానికి చెందిన వారు.. ఇంత పెద్ద ఫ్యామిలీ మీది.. వీరమాచినేని ఫ్యామిలీ అంటే నాలుగు పెద్ద ఫ్యామిలీలో ఒకటి.. అలాంటిది మీ అమ్మాయి ఓ తెల్లోడిని చేసుకుంటుందా..? వాడిని ఎలాగోలా అక్కడి మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించి.. జీవితాల్లో బయటకు రాకుండా చేద్దాం.. అని కొంతమంది కుట్ర చేశారు అని అన్నారు. “జనం ఎంత వెనకబడి ఉన్నారో ఇది చూస్తే అర్ధమవుతుంది. నేను వాళ్లకు చెప్పా.. మీరు ఈ ఎదవ ఆలోచనలు , ఎదవ పనుల్లో చెయ్యొద్దు. నువ్వు అలా చేస్తే నా జీవితమంతా నేను వాడిని బయటకు ఎలా తీసుకురావాలని అని నేను ఇబ్బందిపడతా.. మా అమ్మాయి, ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు. మీకెందుకు అయ్యా మధ్యలో.. మాకు లేని గొడవ మీకెందుకు అని చెప్పా.. ఏంటి కులం.? మనమేమైనా పుట్టించామా..? నేను హైదరాబాద్ లో ఉంటున్నా అంటే నేను ఉంటున్నా అంతే.. హైదరాబాద్ నాది కాదు.. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతారు.. అందుకే నేను జనాలను ఎక్కువగా కలవను” అని అన్నారు జగపతి బాబు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ

జగపతి బాబు ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..