AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ లక్కీ హీరోయిన్..! చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. కొంతమంది చిన్న చిన్న సినిమాలతో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్.. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం అందుకోలేకపోతుంది.

టాలీవుడ్ లక్కీ హీరోయిన్..! చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2025 | 12:44 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు ఎంత క్రేజ్ తెచ్చుకున్నాం అనేది ముఖ్యం.. చాలా మంది హీరోయిన్స్ పదుల సంఖ్యలో సినిమాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోరు. కానీ కొంతమంది భామలు మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీ తక్కువ సినిమాలతో పాపులర్ అయ్యి.. ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం వరుసగా సినిమాలు చేసిన అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ వరుసగా సినిమాలు చేసింది. ఆ సినిమా హిట్ కూడా అయ్యాయి . కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావడం లేదు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు. మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో శాన్వి మేఘన ఒకరు. శాన్వి మేఘన 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ 2019లో “సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది. ఆ తర్వాత “పిట్ట కథలు” , “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

“పుష్పక విమానం”లో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్‌గా చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది. తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్‌ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో రీసెంట్ గా టుక్ టుక్ అనే సినిమా చేసింది. చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నా ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. ఇప్పటికైన ఈ అమ్మడికి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్