AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. కానీ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మాత్రం అవకాశాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో ఈ యంగ్ హీరో ఒకరు.

అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2025 | 11:07 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ మారి సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.? హీరోయిన్ ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన దేవి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో తన నటనతో భయపెట్టించాడు. అలాగే మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాల్లో కనిపించాడు. ఇంతకీ ఆ కుర్రాడి పేరు ఏంటో తెలుసా.. తన పేరు మహేంద్రన్. తెలుగులో ఆహా మూవీతో వెండితెరకు పరిచమయమైన మహేంద్రన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 1994లో కోలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. చిన్నవయసులోనే తనదైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు మహేంద్రన్.

ఇది కూడా చదవండి : అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు మహేంద్రన్. ముఖ్యంగా దేవీ, లిటిల్ హార్ట్స్ సినిమాల్లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషలలో బాల నటుడుగా దాదాపు 130 సినిమాలలో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ

ఇటీవలే ఈ చిన్నోడు హీరోగా మారాడు. తమిళంలో హీరోగా అనేక సినిమాలు చేశాడు. అలాగే ఇతర హీరోల సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు. మాస్టర్ సినిమాలో యంగ్ భవాని రోల్‌లో కనిపించింది మహేంద్రనే.  కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.. అప్పట్లో నాకోసం స్టార్ హీరోలు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఆఫర్స్ ఇవ్వడం లేదు అని అన్నాడు మహేంద్రన్. ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ మాట్లాడుతూ.. ఒక సమయంలో మంచి పీక్ చూశాను.. ఒకే రోజు నాలుగు సినిమాలు చేశాను. రోజుకు మూడు విమానాలు దిగేవాడిని. ఉదయం తమిళనాడులో, మధ్యాహ్నం పొలాచీలో .. రాత్రి హైదరాబాద్ లో షూట్ చేసేవాడిని.. నాకోసం స్టార్స్ ఎదురుచూసేవారు. నాకోసమే ఎక్కువగా నైట్ షూట్స్ పెట్టేవారు. అప్పట్లో ఆహా అనే సినిమాలో నటించా.. అందులో నటించిన స్టార్స్ .. రఘువరుణ్ గారు, జయసుధగారు, జగపతిబాబుగారు ఇలా ఎదురుచూసేవారు. అలాంటి నాకు మధ్యలో సినిమాలు లేవు.. ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వలేదు. పెద్దయ్యాక ఆఫర్స్ ఇవ్వలేదు.. హీరోలా లేదు.. చిన్నోడు కాదు పెద్దోడు కాదు అంటూ నన్ను రిజెక్ట్ చేశారు.. చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు తిరిగి ఆఫర్స్ అందుకుంటున్నా.. ఇది నా అసలైన జర్నీ అని చెప్పుకొచ్చాడు మహేంద్రన్.

ఇది కూడా చదవండి :మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us