సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..! అలనాటి నటీమణి సరోజాదేవి కన్నుమూశారు..
వెండితెరను ఏలిన అలనాటి నటీమణి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్‌తో నటించారామె.. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో 200 సినిమాలకుపైగా సరోజాదేవి నటించి మెప్పించారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వెండితెరను ఏలిన అలనాటి నటీమణి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్‌తో నటించారామె.. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో 200 సినిమాలకుపైగా సరోజాదేవి నటించి మెప్పించారు. 1938 జనవరి 7న సరోజాదేవి జన్మించారు. సరోజా దేవి 1955లో ‘మహాకవి కాళిదాస’ చిత్రం ద్వారా నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ సమయంలో ఆమెకు 17 సంవత్సరాలు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు సరోజాదేవిని వరించాయి. బడిపంతులు, భూకైలాస్, సీతారామ కల్యాణం, కష్టసుఖాలు వంటి సూపర్‌హిట్ సినిమాల్లో ఆమె నటించారు.
ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, పవిత్ర ప్రేమ, శ్రీకృష్ణార్జున యుద్ధము, దానవీర శూర కర్ణ, ఆత్మబలం వంటి సినిమాలతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. సరోజాదేవి మరణం పై టాలీవుడ్ సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్
సరోజాదేవి 1967లో హర్షను వివాహం చేసుకుంది. ఆమె భర్త 1986లో మరణించారు. ఇప్పుడు సరోజాదేవి అంత్యక్రియలు ఆమె భర్త హర్ష సమాధి పక్కనే జరగనున్నాయి.సరోజాదేవికు 87 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరోజా దేవి కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమె ఆరున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








