మాస్టర్ ప్రాణం తీసిన స్టంట్ ఇదే వీడియో ! వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే
తమిళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తంగలాన్ డైరెక్టర్ పా. రంజిత్, ఆర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రాజు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బుధవారం సినిమా షూటింగ్ లో భాగంగా రాజ ఓ కారు స్టంట్ చేస్తుండగా యాక్సిడెంట్ జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Stunt Master Raju
సినిమా ప్రరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పా రంజిత్ సినిమా షూటింగ్ లో ఒక డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేశారు స్టంట్ మాస్టర్ ఎస్ ఎం రాజు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలై రాజు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే స్టంట్ ఎంత డేంజరస్ గా చేశారో అర్ధమవుతుంది. ఒళ్లు గగ్గుర్లు పొడిచే ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.




