AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: అతడి వల్లే CSKకి ఆరో టైటిల్.. ఆ సలారోడు వచ్చింది అందుకే.!

ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆరో టైటిల్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. సంజూ శాంసన్ జట్టులో చేరడం వల్ల బ్యాటింగ్ బలం పెరిగిందని, ఓపెనింగ్ సమస్యలు తీరాయని పీయూష్ చావ్లా పేర్కొన్నారు. ఇర్ఫాన్ పఠాన్ సైతం శాంసన్ రాకతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

IPL 2026: అతడి వల్లే CSKకి ఆరో టైటిల్.. ఆ సలారోడు వచ్చింది అందుకే.!
Chennai Super Kings
Ravi Kiran
|

Updated on: Mar 14, 2026 | 8:54 PM

Share

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆరో టైటిల్ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ జట్టులో చేరడంతో సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్ గణనీయంగా బలపడింది. దీనిపై మాజీ క్రికెటర్లు పీయూష్ చావ్లా, ఇర్ఫాన్ పఠాన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చాలా కాలంగా ఉన్న ఓపెనింగ్ సమస్య సంజూ శాంసన్ రాకతో పూర్తిగా తొలగిపోయిందని పేర్కొన్నారు. శాంసన్ ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నర్ అని, ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లపై మూడు కీలక మ్యాచ్‌లలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తుచేశారు. ఈ ఐపీఎల్ ప్రారంభానికి అతను మంచి ఫామ్‌లో ఉండటం సీఎస్‌కేకు ఎంతో కలిసొస్తుందని చావ్లా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని పిచ్‌లను బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చారని, గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు పిచ్‌లు పూర్తిగా మారిపోయాయని ఆయన తెలిపారు.

దీంతో ఓపెనింగ్ నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేయడం సీఎస్‌కేకు చాలా ఉపయోగకరంగా మారుతుందని చావ్లా నొక్కి చెప్పారు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే త్వరగా వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడిందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆయుష్ మాత్రే వంటి యువ క్రికెటర్లు రావడంతో సీఎస్‌కే పరుగులు చేయడం ప్రారంభించిందని, ఇప్పుడు శాంసన్ రాకతో ఓపెనింగ్ బ్లాక్‌బస్టర్‌గా మారుతుందని చావ్లా అన్నారు. గత సీజన్‌లో రుతురాజ్ గాయక్వాడ్ కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచినప్పటికీ, మినీ యాక్షన్‌లో అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసి బలమైన స్క్వాడ్‌ను సిద్ధం చేసుకుందని పీయూష్ చావ్లా వెల్లడించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఆరవ టైటిల్ గెలుచుకునే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని చావ్లా పేర్కొన్నారు.

ఇక మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం శాంసన్ చేరికపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సంజూ శాంసన్ చెన్నై జట్టులో చేరడం వల్ల కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని పఠాన్ అభిప్రాయపడ్డారు. ఎంఎస్ ధోని వంటి దిగ్గజ కెప్టెన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేయడం సులభం కాదని ఆయన అన్నారు. అయితే, ధోని మద్దతుతో పాటు శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ సహాయం రుతురాజ్‌కు చాలా ఉపయోగపడతాయని పఠాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎంఎస్ ధోని తర్వాత భవిష్యత్తులో సీఎస్‌కేకు కీలక కీపర్ కం బ్యాటర్‌గా సంజూ శాంసన్ ప్రముఖ పాత్ర పోషిస్తాడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. జట్టులో బ్రెవిస్, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్లతో సీఎస్‌కే ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చారు.

ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..

Follow Us