Megastar Chiranjeevi: ఆప్యాయతలో మా అన్నయ్య బంగారం..! అభిమానుల మనసు గెలుచుకుంటున్న వీడియో
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన ఆయనకు అశేష అభిమాన గణం ఉంది. ఎంతోమంది యువనటులు మెగాస్టార్‌నే ఆదర్శంగా తీసుకుని సినిమాల్లో రాణిస్తున్నారు. చిరంజీవి ఇంత అభిమానం సంపాదించుకున్నారంటే దానికి కారణం సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా.

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో తొలుత కాస్త.. ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అనంతరం.. ‘ఖైదీ’ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘మెగాస్టార్ చిరంజీవి’గా ప్రేక్షకుల గుండెల్లో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. 1980లలో చిరంజీవి ఒక ప్రభంజనం. బాలీవుడ్‌లో బిగ్‌బీ ఎలానో.. టాలీవుడ్‌లో చిరంజీవి అలా. దివంగత మాజీ సీఎం, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తరువాత.. ఆ స్థాయిలో అభిమానించతగ్గ గొప్ప నటుడిగా.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు
మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. చిరంజీవికి డై హార్ట్ ఫాన్స్ ఉన్నారు అభిమానులంటే చిరంజీవికి కూడా అంతే ఇష్టం.. తనను ప్రేమతో కలవడానికి వచ్చిన అభిమానులు ఎంతో ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు చిరంజీవి. తాజాగా చిరంజీవిని ఆయన అభిమాని ఒకరు కలిశారు. అందులో ఏముంది అనుకుంటున్నారా.?
ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది
చిరంజీవిని కలిసిన ఆ అభిమాని పేరు కూడా చిరంజీవి. సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పాటలకు, సినిమా డైలాగ్స్ కు అచ్చం మెగాస్టార్ లానే అభినయం కనబరుస్తూ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే చిరంజీవిని కలవాలన్నది అతని కల. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.. తన భార్య కూడా చిరంజీవికి పెద్ద అభిమాని.. ఆయనను ఎలాగైనా చిరంజీవిని కలవాలని తన భార్య కూడా కోరుకుంది. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న తన భార్యను వీల్ చైర్ లో కూర్చోపెట్టుకొని మెగాస్టార్ ను కలవడానికి వచ్చారు ఆ అభిమాను. వారిని చూసిన మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న భార్యను తీసుకొని తనను కలవడానికి వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించారు చిరంజీవి. ఆ అభిమాని చిరంజీవి కళ్ళకు దండం పెట్టబోతే అయ్యో వద్దు అంటూ అతన్ని ఆపారు చిరు.. కానీ ఇది తన భార్య కోరిక అంటూ చిరంజీవి కాళ్ల మీద పడ్డాడు ఆ అభిమాని. తన అభిమానులతో ఫోటోలు దిగారు చిరు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి అభిమానులు మెగాస్టార్ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







