Mahesh Babu : మహేష్ హీరోయిన్ ఎలా మారిపోయిందేంటీ..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి ఈ సినిమాను పాన్ గ్లోబల్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు బడీ పెంచారు. మహేష్ బల్కీ లుక్ లో అదిరిపోయాడు. అలాగే పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సింహంలా ఉన్నాడు మహేష్. మహేష్ లుక్‌కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమాల్లో అభిమానులను మెప్పించిన సినిమా అతిథి మూవీ ఒకటి. యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు
పోకిరి లాంటి సంచలన విజయం తర్వాత మహేష్ సైనికుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. ఆతర్వాత అతిథి మూవీ వచ్చింది. అతిథి సినిమాలో మహేష్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. లాంగ్ హెయిర్ లో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. అతిథి మూవీ కథ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది
కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన, యాక్షన్ సీన్స్, అలాగే మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ నటించింది. ఆ అమ్మడి పేరు అమృత రావు. మోడలింగ్ నుంచి నటనలోకి వచ్చింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించిన వివాహ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది అమృత. ఎక్కువుగా హిందీలోనే నటించింది ఈ బ్యూటీ. తెలుగులో ఈ భామ అతిథి సినిమా ఒక్కటే చేసింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా ఈ భామ 2018లో వచ్చిన సంజు సినిమాలో నటించింది ఆతర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ చిన్నది. అమృత అన్మోల్ అనే రేడియో జాకీతో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ.. 7 సవంత్సరాలు ప్రేమించుకుని 15th మే 2013 న ముంబాయిలో వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








