AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రజాకార్ సినిమా విలన్ గుర్తున్నాడా? ఆయన కూతురు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల ఫేవరెట్

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో సుమారు 25 కు పైగా సినిమాల్లో నటించాడీ సీనియర్ యాక్టర్. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ కూతురు కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఏకంగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Tollywood: రజాకార్ సినిమా విలన్ గుర్తున్నాడా? ఆయన కూతురు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల ఫేవరెట్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 14, 2025 | 10:48 PM

Share

ఆ మధ్యన రిలీజైన రజాకార్ సినిమా గుర్తుందా? భార‌త‌దేశంలో హైద‌రాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా బాగానే ఆడింది. ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గద్దర్ అవార్డుల్లోనూ ఈ సినిమాకు పురస్కారాలు దక్కాయి. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా, వేదిక‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే వీరందరికన్నా సినిమాలో బాగా హైలెట్ అయ్యింది మాత్రం ఖాసీం రజ్వీ పాత్ర. కరుడు గట్టిన నిజాం ప్రభువుగా, నిరంకుశవాదిగా ఈ రోల్ లో ఒదిగిపోయాడు నటుడు అర్జున్ రాజ్. రజాకార్ సినిమాలో అతనిని చూసి చాలా మంది అసహ్యించుకున్నారు. ఈసడించుకున్నారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అర్జున్ రాజ్. ఈ సినిమాతో పాటు గం గం గణేశా, డియర్ కామ్రేడ్ తదితర సినిమాల్లోనూ విలన్ గా నటించి మెప్పించాడు అర్జున్ రాజ్. అలాగే తమిళ్, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో పలు తమిళ్, హిందీ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

అన్నట్లు అర్జున్ రాజ్ కూతురు కూడా హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా? అవును.. ఆమె మరోవరో కాదు సారా అర్జున్. ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ.. నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన పాప అంటే ఇట్టే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసిందీ అందాల తార. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సారా పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

రణ్ వీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా..

రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ధురంధర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సారా అర్జున్. ఇటీవలే ఈ టీజర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.

కూతురితో రాజ్ అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు