AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Srinivasa Rao: దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావుకు తీరని ఓకే ఒక కోరిక! 18 ఏళ్లు ఎదురు చూసినా! పాపం..

40 ఏళ్ల సినిమా కెరీర్.. సుమారు 750కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించి మెప్పించిన కోట శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒకటుందట. అందుకోసం ఆయన ఏకంగా 18 ఏళ్లే పరితపించారు. కానీ అది జరగలేదు. ఇంతకీ ఆ కోరిక ఏంటా అనుకుంటున్నారా?

Kota Srinivasa Rao: దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావుకు తీరని ఓకే ఒక కోరిక! 18 ఏళ్లు ఎదురు చూసినా! పాపం..
Kota Srinivas Rao
Basha Shek
|

Updated on: Jul 15, 2025 | 7:16 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు తోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 750 కు పైగా సినిమాల్లో నటించారు. తండ్రిగా, తాతగా, మామగా, బాబాయ్‌గా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఆడియెన్స్ చేత చప్పట్లు కొట్టించుకున్నారు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ, నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే తన 40 ఏళ్ల సినిమా కెరీర్ లో కోట శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒక్కటే ఒకటుంది. దాని కోసం ఆయన 18 ఏళ్ల పాటు పరితపించారట. కానీ అది నెరవేరలేదట. అదేంటంటే.. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి నటించడం. అవును.. తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక్క సీన్ లో నైనా కలిసి నటించలేదేఅన్న బాధ ఆయనలో ఉండేదట. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఈ అవకాశం ఆయన 18 ఏళ్లు ఎదురు చూశారట. కానీ అది నెరవేరలేదు. కోట శ్రీనివాస రావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికే ఎన్టీఆర్ ఇండస్ట్రీని వదిలి పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం మూడు, నాలుగు సినిమాల్లోనే నటించారు ఎన్టీఆర్. చివరికీ ఆ సినిమాల్లోనూ కోటకు అవకాశం రాలేదు. చివరకు ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాత్ర కోసం కోటకు పిలుపు వచ్చింది. కానీ.. అప్పటికే కోటకు బిజీ షెడ్యూల్‌ ఉండడంతో ఆ ఛాన్స్ కూడా పోయింది. చివరకు మేజర్ చంద్ర కాంత్ సినిమానే ఎన్టీఆర్ ఆఖరి మూవీ కావడంతో కోట శ్రీనివాసరావు కోరిక తీరలేదు.

ఇవి కూడా చదవండి

కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో..

View this post on Instagram

A post shared by Mukesh G (@celebritys.news)

బాలయ్య, ఎన్టీఆర్ లతో సూపర్ హిట్ సినిమాలు..

ఎన్టీఆర్ తో నటించకపోయినా మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ రోల్ లో నటించి మెప్పించారు కోట. ఆ తర్వాత ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణతో కూడా పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే మనవడు ఎన్టీఆర్ తో కూడా కలిసి నటించారు. కాగా కోట శ్రీనివాసరావు చివరిగా పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీలో నటించారని తెలుస్తోంది. జులై 24న దీనిపై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..