AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు వరంగల్ మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్‌లో టాప్ కమెడియన్స్‌ అంటే అందరికీ బ్రహ్మనందం, అలీ, వేణు మాధవ్, సునీల్ తదితర నటుల పేర్లు ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే వీరిలో చాలా మంది ఇప్పుడూ సినిమాలు చేయడం లేదు. దీంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు కొత్త నటులు తెరపైకి వస్తున్నారు.

Tollywood: ఒకప్పుడు వరంగల్ మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Comedian
Basha Shek
|

Updated on: Jul 18, 2025 | 6:55 AM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్. తెలంగాణలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మిమిక్రీ కూడా నేర్చుకున్నాడు. వన్స్ మోర్ ప్లీజ్ వంటి పలు టీవీ షోల్లో కూడా పాల్గొని సత్తా చాటాడు. కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో చేసేదేమి లేక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి చేరాడు. కొంత కాలం పాటు ప్రముఖ ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని కూడా చేశాడు. కానీ నటనపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ రేడియో జాకీగా చేరాడు. అక్కడ అతని ప్రోగ్రాంకు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చేశాడు. జబర్దస్త్ లో అవకాశం సంపాదించుకున్నాడు. స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అతనే బలగం ఫేమ్ రచ్చ రవి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతను తన సోషల్ మీడియా ఖాతాల్లో తన చిన్నప్పటి ఫొటోలను షేర్ చేశాడు. ఇదే సందర్భంలో తన సినిమా జర్నీని అభిమానులతో పంచుకున్నాడు.

‘కాక.. సినిమా ఫీల్డ్ రావడానికి ఏర్పాట్లు చేసుకునే క్రమంలో కష్టపడి 100 రూపాయలు సంపాదించుకొని నా మిత్రుడు వంశీ తో కలిసి పెళ్లిళ్ల సీజన్లో బిజీగా ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ నీ దొరక పట్టుకుని దారిలో తాళం వేసిన ఇంటిపైన గేటు తీసుకొని పోయి సినీ ప్రయాణానికి అవకాశాల వేటలో పరుగులు తీయడానికి మొదటి ఆల్బమ్ చేయించుకున్న రోజులవి. చలో కృష్ణ నగర్. ఇంద్రనగర్.. ఫిలింనగర్.. అని ఇద్దరు మిత్రులతో హైదరాబాద్ బయలుదేరా! ఎందుకో రాత్రి గుర్తొచ్చింది కాక మీతో చెప్పుకుందామని….. నేను మీ రచ్చ. నా సినీ ప్రయాణం వన్స్ మోర్ ప్లీజ్….. అబ్బబ్బ ప్లీజ్ వన్స్ మో అంటూ…. మనందరికీ ఇష్టమైన వేణుమాధవ్ అన్న షో ద్వారా షురూ అయింది… ఒకసారి రాత్రి గుర్తు చేసుకున్న మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్న… ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క అవకాశం ఒక గొప్ప అనుభవం… మీ అందరి ఆశీస్సులు.. 140 చిత్రాలు….. అవకాశం ఇచ్చిన సినీ రంగా పెద్దలకు, గురువులకు ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలు.. నేను మీ రచ్చ రవి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు రచ్చ రవి.

ఇవి కూడా చదవండి

రచ్చ రవి షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Ravi Racha (@meracharavi)

రచ్చ రవి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..