AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adi Reddy: మళ్లీ తండ్రి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి.. ఘనంగా భార్య సీమంతం.. వీడియో ఇదిగో

2020లో కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి. ఇపప్పటికే ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. ఇప్పుడు ఆది రెడ్డి మరోసారి తండ్రి కానున్నాడు. అతని భార్య రెండోసారి గర్భం దాల్చింది. తాజాగా ఆమె సీమంతం గ్రాండ్ గా జరిగింది.

Adi Reddy: మళ్లీ తండ్రి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి.. ఘనంగా భార్య సీమంతం.. వీడియో ఇదిగో
Adi Reddy
Basha Shek
|

Updated on: Jul 19, 2025 | 7:54 PM

Share

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యూట్యూబర్ గా, రివ్యూయర్ గా..ఇలా తెలుగు రాష్ట్రాల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట, మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఫైనల్ వరకు వెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తన దైన శైలిలో రివ్యూలు ఇస్తున్నాడు. బిగ్ బాస్ తో పాటు అప్పుడప్పుడు సినిమాలపైనా తన అభిప్రాయాలు చెబుతున్నాడు. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు రూపొందిస్తూ నెట్టింట బాగానే పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ రివ్యూలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే ఆది రెడ్డి తన ఫాలో వర్స్ కు ఒక శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అతని భార్య కవిత గర్భంతో ఉంది. తాజాగా ఆమెకు గ్రాండ్ గా సీమంతం కూడా నిర్వహించాడు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు కూడ పాల్గొన్నారు. ఇదుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఆది రెడ్డి.. ‘ నా సీతా సీమంతం’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆది రెడ్డి – కవిత దంపతులకు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య సీమంతం వేడుకలో బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి.. వీడియో..

ఇక 2020లో కవిత అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు ఆది రెడ్డి. ఇప్పటికే ఈ దంపతులకు అద్విత అనే కూతురు ఉంది. ఇప్పుడు మరో పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యారీ లవ్లీ కపుల్.

భార్య, కూతురుతో ఆది రెడ్డి..

ఒక టీవీ షోలో భార్య, చెల్లెలితో కలిసి ఆది  రెడ్డి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్