AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నవీన్ చంద్ర మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

28 డిగ్రీ సెల్సియస్, బ్లైండ్ స్పాట్, లెవెన్.. నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సినిమాల జాబితా ఇది. థియేటర్ల సంగతి పక్కన పెడితే ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో నవీన్ చంద్ర ఒక్కసారిగా ఓటీటీ స్టార్ గా మారిపోయాడు.

OTT Movie: నవీన్ చంద్ర మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 19, 2025 | 9:17 PM

Share

హీరో నవీన్ చంద్ర ఈ మధ్యన ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. ఆడియెన్స్ కూడా ఈ హీరో సినిమాలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఈ మధ్యన నవీన్ చంద్ర నటించిన 28 డిగ్రీ సెల్సియస్, బ్లైండ్ స్పాట్, లెవెన్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతకు ముందు స్నేక్ అండ్ ల్యాడర్స్, ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ లకు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిదే కోవలో మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో మన ముందుకు రానున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అతను నటించిన తాజా చిత్రం షో టైమ్. పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. అలాగే రాజా రవీంద్ర, నరేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్టుగానే జూలై 4న థియేటర్లలో రిలీజైన షో టైమ్ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసింది. కాన్సెప్ట్ పరంగా ప్రశంసలు అందుకుంది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, సరైన సంఖ్యలో థియేటర్లు దొరక్క పోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. దీంతో థియేటర్లలో రిలీజైన కొద్ది రోజులకే షో టైమ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

షో టైమ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి అప్ డేట్ ఇచ్చింది. జులై 25 నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రశాంతమైన ఇల్లు ఓ ప్రాణాంతక రహస్యానికి కేంద్రం అయితే…’ అంటూ సస్పెన్స్‌తో కూడిన క్యాప్షన్, స్పెషల్ పోస్టర్‌తో ఓటీటీ రిలీజ్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించారు. స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో కిషోర్ గరికపాటి నిర్మించారు. ఒకే రోజులో ఒకే ఇంట్లో జరిగే క్రైమ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..