Cinema: రూ.350 కోట్లు గంగపాలు చేసిన సినిమా.. థియేటర్లలో పెద్ద ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టు..
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూ.350 కోట్లతో నిర్మించిన ఓ యాక్షన్ డ్రామా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో అదే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు..

ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కోట్లతో నిర్మించిన సినిమాలు చివరకు నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అలాంటి జానరే. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? అదే విడాముయార్చి. అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. 2025లో భారీ హైప్ మధ్య అత్యంత ఎదురుచూస్తున్న తమిళ విడుదలలలో ఒకటి. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. మన దేశంలో రూ.81 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.135.65 కోట్లు మాత్రమే రాబట్టింది.
థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమాకు IMDb రేటింగ్ 6.8/10 సంపాదించుకుంది. భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ హిట్ కాలేదు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విడాకులు తీసుకోవాలనుకుంటున్న అరుణ్, కయల్ అనే జంట చివరిసారిగా ఒక రోడ్ ట్రిప్ వెళ్లాలనుకుంటారు. దీంతో అజర్ బైజాన్ గుండా రోడ్ ట్రిప్ వెళ్తారు. అప్పుడే వారిద్దరిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఓ షాకింగ్ రహస్యం కథ మొత్తాన్ని మలుపులు తిప్పుతుంది. అద్భుతమైన విజువల్స్, సస్పెన్స్ నిండిన కథనంతో.. క్లైమాక్స్ ప్రేక్షకులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేస్తుంది. ఇందులో ఎప్పటిలాగే అజిత్, త్రిష అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. విడాముయార్చి సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








