AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: రూ.1500 కోట్ల బడ్జెట్.. రూ.4500 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. మీరు చూశారా..?

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నిత్యం థియేటర్లలతోపాటు ఓటీటీల్లోనూ ఈ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం పన్నెండు రోజుల్లోనే బాక్సాఫీస్ షేక్ చేసింది.

Cinema: రూ.1500 కోట్ల బడ్జెట్.. రూ.4500 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. మీరు చూశారా..?
Jurassic World Rebirth
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2025 | 6:47 PM

Share

మీకు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే ఇష్టమా.. ? అయితే మీరు ఇప్పుడు ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే.. భవిష్యత్ గందరగోళంతో చుట్టబడిన ఓ రహస్య కథ .. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులకు ప్రతి క్షణం సైన్స్, ఉత్కంఠను కలిసే ప్రపంచంలోకి లాగుతుంది. హై-ఆక్టేన్ విజువల్స్, ఆకర్షణీయమైన కథనంతో నిండిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైలాగ్స్, విజువల్స్ మీకు మరింత ఆసక్తిని కలిగించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మనసును కదిలించే సన్నివేశాలు, భావోద్వేగలతో కూడిన ఈ సినిమా ఆద్యంతం జనాలను కట్టిపడేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం పన్నెండు రోజుల్లోనే రూ.4500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ తిరగరాసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

2025లో భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా మరెదో కాదు.. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ జురాసిక్ సిరీస్‌లో ఏడవ చిత్రం. గత 22 సంవత్సరాలుగా డైనోసార్ల ప్రపంచం ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాని బడ్జెట్ కంటే మూడు రెట్లు కలెక్షన్స్ రాబట్టింది. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ భారతీయ థియేటర్లలో బ్లాక్ బస్టర్ ప్రారంభం అయింది. ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ. 86 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుంది.

Telugu Cinema: 16 ఏళ్లకే హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్..

ఇవి కూడా చదవండి

ఇందులో ప్రముఖ నటి స్కార్లెట్ జోహన్సన్, ఎమ్మీ, SAG నామినీ జోనాథన్ బెయిలీ, రెండుసార్లు ఆస్కార్ విజేత మహర్షలా అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. మిషన్ ఇంపాజిబుల్- ది ఫైనల్ రికనింగ్ తర్వాత ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న రెండవ సినిమాగా నిలిచింది. జూలై 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై దాదాపు రూ.4500 కోట్లు వసూలు చేసింది.ఈ చిత్రం బడ్జెట్ రూ.1541 కోట్లు అని సమాచారం.

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు