- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress This Photo, She Is Heroine Divya Bharathi
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..
తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నిజానికి తమిళంలో ఈ అమ్మడు చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక తొలి చిత్రంలోనే ఓ రేంజ్ గ్లామర్ షోతో కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?
Updated on: Jul 12, 2025 | 9:06 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా.. ? ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా చేస్తుంది. కానీ ఈ మూవీ విడుదల కాకుండానే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.

నిజానికి తమిళంలో ఆమె చేసిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టేందుకు వెయిట్ చేస్తుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ దివ్య భారతి. బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించారు. ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది ఈ అమ్మడు. తొలి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఆ సినిమా తర్వాత దివ్య భారతి పేరు మారుమోగింది. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ సరసన గోట్ సినిమాలో నటిస్తుంది. ఈమూవీతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అయితే తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

సినిమాలతో కాకుండా పర్సనల్ విషయాలతోనే దివ్య భారతి ఎక్కువగా వార్తలలో నిలిచింది. హీరో జీవీ ప్రకాష్, దివ్య భారతి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో తన గురించి వస్తున్న రూమర్స్ పై గట్టిగానే స్పందించింది. తనపై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది.




