AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాసం విడిచారు. 1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కోటా.. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా సినిమాల్లో నటించారు.

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Kota Srinivasa Rao
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2025 | 7:20 AM

Share

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అస్వస్థతతో భాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.. నాలుగూదశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోటా శ్రీనివాసరావు.. దాదాపు750 కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు మరణవార్త పై విచారం వ్యక్తం చేస్తున్న పలువురు సినీ ప్రముఖులు.

కోట శ్రీనివాసరావు కంకిపాడు 1942, జులై 10న జన్మించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాస రావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్. దీంతో తండ్రిలాగే డాక్టర్ కావాలని అనుకున్నారు కోట. కానీ నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల నటనవైపు అడుగులు వేశారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తరచూ నాటకాలు వేసేవారు. ఆ సమయంలో తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన మాత్రం లేదు. 1977లో కోట ఆయన స్నేహితులు కలిసి ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకం నిర్మాత క్రాంతికుమార్ కు బాగా నచ్చింది. దీంతో దానిని సినిమాగా తియాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాటకంలో నటించిన వారందరన్నీ తన సినిమా కోసం తీసుకుని ప్రాణం ఖరీదు పేరుతోనే ఆ సినిమాను నిర్మించారు క్రాంతికుమార్.1978లొ ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా ద్వారానే మెగాస్టార్ చిరంజీవి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు కోటా. 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోని కోటా.. ప్రతి ఘటన చిత్రంతో విలన్‏గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అహ నా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడుగా కొనసాగిన కోటా.. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు 750 పైగా చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్ గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఇండస్ట్రీలో కోటా బాబు మోహన్ జంట అంటే సినిమా హిట్టే అనే టాక్ ఉండేది. కోటా బాబు మోహన్ కలసి దాదాపు 60 చిత్రాల్లో నటించారు.

విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అలాగే 2015 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. నాలుగు దశాబ్దాల సినీప్రయాణంలో మొత్తం తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించిన కోటా.. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరగ్గా.. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. కొడుకు కోట ప్రసాద్ 2010 జూన్ 21 లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..