Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..
నటనపై ఆసక్తి.. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముందుగా యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతుంది. స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినీరంగంలోకి అడుగుపెట్టే ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సినీప్రయాణంలో అనేక పోరాటాల తర్వాత యూట్యూబ్ వీడియోస్ ద్వారా నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా సినిమా అవకాశాలు అందుకుంది. కానీ ఓ స్టార్ హీరో సినిమాలో చేసిన 20 నిమిషాల పాత్ర ఆమె కెరీర్ మలుపు తిప్పింది. దీంతో రాత్రికి రాత్రే స్టార్ గా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. త్రిప్తి దిమ్రి. 1994 ఫిబ్రవరి 23న ఢిల్లీలో జన్మించారు.
ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ అమ్మాయి కాలేజీ విద్య కోసం ఢిల్లీకి వెళ్లింది. విప్రా డైలాగ్స్ అనే యూట్యూబ్ వీడియోతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత యాక్టింగ్ వర్క్ షాప్స్, మోడలింగ్, ఆడిషన్స్ లో పాల్గొంది. సన్నీ డియోల్, బాబీ డియోలతో కలిసి వచ్చిన మూవీ పోస్టర్ తో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆమె పాత్ర తక్కువే అయినప్పటికీ, ఆమె తన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ తర్వాత లైలా మజ్ను, బుల్బుల్, ఖాలా వంటి చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఆమె తన అద్భుతమైన నటనతో ఆకట్టుకునే నటిగా తనను తాను నిరూపించుకుంది.
ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో జోయా పాత్రలో కనిపించింది. రణబీర్, త్రిప్తి దిమ్రి కాంబోలో వచ్చే సన్నివేశాలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలు కేవలం 20 నిమిషాలు మాత్రమే అయినప్పటికీ మంచి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తున్న ఆమె.. ఇప్పుడు స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ జోడిగా ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..








