Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..
ఒక్క సినిమాతోనే తెలుగు సినీరంగంలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. దీంతో దెబ్బకు ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్క ఏడాదిలోనే అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించింది. కానీ ఈమధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ డిజాస్టర్స్ అవుతున్నాయి. అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో వరుస సినిమాలతో అలరించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లకే పోటీనిచ్చింది. దీంతో ఈ బ్యూటీతో సినిమా చేసేందుకు అగ్ర హీరోలు సైతం ఆసక్తి చూపించారు. కట్ చేస్తే.. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుస ప్లాపులతో సతమవుతుంది ఈ అమ్మడు. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం సైతం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే వరుస ప్లాపులు వచ్చినప్పటికీ ఈ అమ్మడు రెమ్యునరేషన్ లో మాత్రం తగ్గేదే లే అంటుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శ్రీలీల.
ధమాకా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది శ్రీలీల. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ హిట్టు మాత్రం అందుకోలేకపోయింది. ఓవైపు సినిమాలతోపాటు.. మరోవైపు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. సినిమాల్లో శ్రీలీల జోరు కాస్త తగ్గింది. ఇటీవలే అఖిల్ సరసన నటించాల్సిన లెనిన్ మూవీ నుంచి తప్పుకుంది. మరోవైపు వైరల్ వయ్యారి అంటూ ప్రత్యేక పాటతో నెట్టింట సంచలనం సృష్టించింది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న జూనియర్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. జెనీలియా కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న శ్రీలీల రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోందట. ఇప్పుడు ఒక్కో సినిమాకు తన పారితోషికం డబుల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకునే శ్రీలీల.. ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. అయితే దీనిపై స్పష్టత రాలేదు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..








