- Telugu News Photo Gallery Cinema photos Actress Priyanka Mohan Upcoming Movies and Wating Film Chances
Actress : చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా ఆఫర్స్ కోసం క్రేజీ హీరోయిన్ వెయిటింగ్..
సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ కొందరు మాత్రం తక్కువ సినిమాలు చేసినప్పటికీ తమదైన ముద్ర వేస్తుంటారు. సక్సెస్ఫుల్ హీరోయిన్ అని ముద్ర వేసుకున్నప్పటికీ అవకాశాలు రాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
Updated on: Jul 16, 2025 | 2:58 PM

తెలుగులో క్రేజీ హీరోయిన్. మొదటి సినిమాతోనే కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. తెలుగుతోపాటు తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యింది. అయినా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. 2019లో కన్నడ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని జోడిగా గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమా తర్వాత ప్రియాంకకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. దీంతో తమిళంలో శివకార్తికేయన్ జోడిగా డాక్టర్, డాన్ చిత్రాల్లో నటించి మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది.

కన్నడ, తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించిన ప్రియాంక.. ఆ తర్వాత సైలెంట్ అయ్యింది.

ఇప్పుడు ప్రియాంక చేతిలో ఓజీ సినిమా మినహా మరో ప్రాజెక్ట్ లేదు. ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించిన ప్రియాంక, ఇప్పుడు గ్లామర్ ఫోజులతో షాకిస్తుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.




