- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Movies Are All Hits But She Did Not Got The Offers In Telugu, She Is Shanvi Meghana
Telugu Actress : ఒక్క సినిమాతోనే రికార్డులు షేక్ చేసింది.. అయినా పట్టించుకోని టాలీవుడ్.. అవకాశాల కోసం..
సినీరంగంలో అందం, అభినయంతో కట్టిపడేసినప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాని తారలు ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ చేసింది.
Updated on: Jul 16, 2025 | 9:45 PM

ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోయిన్గా, సైడ్ ఆర్టిస్టుగా, సెకండ్ లీడ్ రోల్ పోషించింది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కానీ ఇటీవల తమిళంలో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది.

శాన్వీ మేఘన.. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. 1998 సెప్టెంబర్ 12న హైదరాబాద్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 2019లో సైరా నరసింహరెడ్డి సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పిట్ట కథలు, బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాల్లో నటించింది.

అలాగే పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయి. అయినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కానీ తమిళంలో ఆఫర్స్ వచ్చాయి.

ఇటీవల తమిళంలో ఆమె నటించిన కుటుంబస్థాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీకి చేసిన 7 సినిమాలు హిట్టయినప్పటికీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా గ్రీన్ కలర్ శారీలో మరింత అందంగా మెరిసిపోతుంది.




