Varsha bollamma: చీరకట్టులో ఎంత ముద్దుగా ఉందో..! క్యూటీ వర్ష క్రేజీ ఫొటోస్
టాలీవుడ్ లో యంగ్ బ్యూటీలు దూసుకుపోతున్నారు. వారిలో వర్ష బొల్లమ్మ ఒకరు. తమిళ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ.. విజయ్ సేతుపతి నటించిన 96 , అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాల్లో కనిపించింది ఈ చిన్నది.
Updated on: Jul 16, 2025 | 1:48 PM

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీలు దూసుకుపోతున్నారు. వారిలో వర్ష బొల్లమ్మ ఒకరు. తమిళ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ.. విజయ్ సేతుపతి నటించిన 96 , అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాల్లో కనిపించింది ఈ చిన్నది.

ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది. తమిళ్, మలయాళ భాషల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైయింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది.

పుష్పకవిమానం సినిమాలో కనిపించింది. అలాగే స్వాతిముత్యం అనే సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఊరు పేరు భైరవకోన సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన క్యూట్ ఫొటోలతోపాటు క్రేజీ వీడియోలను కూడా షేర్ చేస్తోంది.

రీసెంట్ గా తమ్ముడు సినిమాలో నటించింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి అంచనాలు మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తెలుగులో వర్షకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ ఈ చిన్నది మంచి ఆఫర్స్ అందుకుంది.

తాజాగా ఈ బ్యూటీ అభిమానులకోసం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలుఇప్పుడు వైరల్ గా మారాయి. తన క్యూట్ క్యూట్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. కుర్రకారు ఈ చిన్నదని ఫొటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.