AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fahadh Faasil: పుష్ప విలన్ చేతిలో బుడ్డ ఫోన్.. ఫహద్ బేబీ ఫోన్ ధరెంతో తెలుసా.. ?

దక్షిణాది చిత్రపరిశ్రమలోని టాప్ హీరోలలో ఫహద్ ఫాజిల్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలతోనూ అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా.

Fahadh Faasil: పుష్ప విలన్ చేతిలో బుడ్డ ఫోన్.. ఫహద్ బేబీ ఫోన్ ధరెంతో తెలుసా.. ?
Fahadh Faasil
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2025 | 5:06 PM

Share

ఫహద్ ఫాజిల్.. ఈ పేరు తెలియని సినీప్రియుడు ఉండరు. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఫహద్.. పుష్ప సినిమాతో విలన్ పాత్రలో ఇరగదీశారు. అలాగే విక్రమ్ సినిమాలోనూ సహయ నటుడిగా మెప్పించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర న్యూస్ వైరలవుతుంది. ఇంతకీ ఏంటో తెలుసా.. ? అదేంటంటే.. ఫహద్ చేతిలో ఉన్న బుడ్డ ఫోన్. తాజాగా నజ్లెన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ పూజా కార్యక్రమానికి ఫహద్ ఫాసిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఫహద్ ఫోన్ మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో ఈ వీడియోలో ఫహాద్ చేతిలో ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రెటీలు విలువైన స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో తోపు హీరో అయినప్పటికీ ఫహద్ చేతిలో చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. దీంతో ఆ ఫోన్ గురించి తెలుసుకోవడానికి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఫహద్ “గ్లోబల్ బ్రాండ్ వెర్టు నుండి వెర్టు అసెంట్ – 4 జిబి – బ్లాక్” అనే ఫోన్ ఉపయోగిస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర $1199 అంటే దాదాపు లక్ష రూపాయాల వరకు ఉంటుంది. వెర్టు అసెంట్ టి ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్ 2008 లో ప్రారంభించబడింది. టైటానియం బాడీ, స్క్రాచ్-రెసిస్టెంట్ నీలమణి క్రిస్టల్ డిస్ప్లే, ఫెరారీ, లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది నోకియా ఫీచర్ ఫోన్‌లలో సాధారణంగా ఉపయోగించే సింబియన్ OS ఆధారంగా కస్టమ్ వెర్టు ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది.

ఇవి కూడా చదవండి

Telugu Cinema: 16 ఏళ్లకే హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్..

ఇదిలా ఉంటే.. ఫహద్ ఫాజిల్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే కెమెరా ముందుకు రావడం.. సెల్ఫీ, ఫోటోస్ తీసుకోవడం తనకు అంతగా నచ్చదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..