- Telugu News Photo Gallery Cinema photos Rishab Shetty From Kantara to Pan India Star Strategic Career Plan
Rishab Shetty: సూపర్ ఫామ్‌లో రిషబ్ శెట్టి.. ఆ తప్పు చేయనంటున్న కాంతార హీరో
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. గతంలో యష్ చేసిన తప్పును తాను రిపీట్ చేయకుండా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నారో.. అదే స్టైల్ ఫాలో అవుతున్నారు రిషబ్.
Updated on: Jul 18, 2025 | 8:36 PM

రిజీనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్‌గా మారిపోయారు రిషబ్ శెట్టి.

కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్, ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో వెంటనే పార్ట్ 2ను సిద్ధం చేస్తున్నారు. కాంతార పార్ట్ 1 సెట్స్ మీద ఉండగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న జై హానుమాన్ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్.

ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచటంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే ఇప్పుడు మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సాండల్‌వుడ్ స్టార్.

ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచటంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే ఇప్పుడు మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సాండల్‌వుడ్ స్టార్.

ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట రిషబ్. గతంలో యష్ కేజీఎఫ్‌తో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోకుండా సినిమాల ఎంపికలో ఆలస్యం చేశారు. ఇప్పుడు రిషబ్ మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.




