- Telugu News Photo Gallery Cinema photos Surekha Vani Daughter Supreeta Shares Photos and Videos About Special puja and Abhishekam to Lord Shiva With Her Mother
Actress: తల్లితో కలిసి శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. ఫోటోస్ వైరల్.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?
టాలీవుడ్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని నటి సురేఖా వాణి. స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి పాపులర్ అయ్యింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Updated on: Jul 18, 2025 | 5:23 PM

టాలీవుడ్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని నటి సురేఖా వాణి. స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి పాపులర్ అయ్యింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

కానీ సోషల్ మీడియాలో కూతురితో కలిసి నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తన కూతురితో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ రీల్స్ చేస్తుంది. ఇక సురేఖా వాణి కూతురు సుప్రీత సైతం నెట్టింట విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్ డోస్ ఒలకబోస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటుంది.

ప్రస్తుతం సుప్రీత కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అమర్ దీప్ చౌదరితో కలిసి చౌదరి గారి అబ్బాయి, నాయుడి గారి అమ్మాయి చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజాగా సుప్రీత తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్, వీడియోస్ షేర్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి శివుడికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు చేసింది. కట్టు బొట్టుతో సంప్రదాయంగా కనిపిస్తుంది. పండితుల సమక్షంలో శివుడికి అభిషేకాలు చేస్తున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

నేను నా శివయ్యా అనే క్యాప్షన్ జతచేస్తూ శివపూజా ఫోటోస్, వీడియోస్ షేర్ చేసింది. ఎప్పుడూ గ్లామర్ ఫోజులతో రచ్చ చేసే సుప్రీత..ఇప్పుడు చీరకట్టులో సంప్రదాయంగా కనిపించడంతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.




