Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..
తెలుగులో ఒక్క సినిమా చేసి జనాల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కొందరు హీరోయిన్స్.. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి అదృశ్యమయ్యారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది.

శిల్పా శెట్టి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. వెంకటేశ్ సరసన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 17 ఏళ్ల వయసులోనే స్టార్ డమ్ సంపాదించుకున్న శిల్పా శెట్టి ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న శిల్పా శెట్టి.. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. అంతేకాదు.. నిత్యం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది. అయితే మీకు తెలుసా.. ? శిల్పా శెట్టి చెల్లెలు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
సాహసవీరుడు సాగరకన్య సినిమాతో అలరించిన శిల్పాశెట్టి చెల్లెలు తెలుగులో ఒక్క సినిమాలో నటించింది. ఆమె మరెవరో కాదు.. షమితా శెట్టి. ది లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన పిలిస్తే పలుకుతా. ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజాయన్ని అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ఆకాశ్ హీరోగా నటించగా.. షమితా శెట్టి కథానాయికగా కనిపించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది షమితా. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే క్రేజ్ సొంతం చేసుకున్న షమితాకు ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.
పిలిస్తే పలుకుతా సినిమా తర్వాత షమితాకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆమె తెలుగులో మళ్లీ సినిమా చేయలేదు. హిందీలో వరుస సినిమాలు చేస్తూ పూర్తిగా బాలీవుడ్ కు అంకితమైంది. ప్రస్తుతం షమితా వయసు 46 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం షమితా సినిమాలు చేయడం లేదు. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..








