AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్! రెండేళ్లుగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే నివాసం

ఈ మధ్యన సెలబ్రిటీల విడాకులు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వాములతో విడిపోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా చేరనుందని నేషనల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

Tollywood: విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్! రెండేళ్లుగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే నివాసం
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 19, 2025 | 10:17 PM

Share

తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వరుడికి అప్పటికే పెళ్లై పోయి విడాకులు తీసుకున్నప్పటికీ తన మనసుకు నచ్చడంతో మను వాడింది. పెళ్లైన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. హనీమూన్, వెకేషన్లు, టూర్లు అంటూ దేశ, విదేశాలు తిరిగొచ్చారు. ఈ ఆలుమగల ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి. అలాంటిది.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దంపతులు గత రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ తన తల్లితో ఉంటే.. భర్త తన పేరెంట్స్ తో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలా పెళ్లైన మూడేళ్లకే విడాకుల విషయంతో వార్తల్లో నిలిచిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు యాపిల్ బ్యూటీ హన్సిక.  తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె మూడేళ్ల క్రితం (2022)  ప్రముఖ వ్యాపార వేత్త సోహైల్‌ కతురియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వీరి వైవాహిక జీవితంలో విభేదాలు నెలకొన్నాయని.. ఈ క్రమంలోనే విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హన్సిక, సోహైల్‌ గత రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారట! హన్సిక తన తల్లితో.. సోహైల్‌ అతడి పేరెంట్స్‌తో ఉంటున్నారని నేషనల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి.

అయితే విడాకుల రూమర్స్‌ గురించి సోహైల్‌ స్పందించాడు.   తమపై జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేల్చిపారేశాడు. అదే సమయంలో తాము వేర్వేరుగా జీవిస్తున్నారన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా గతంలో హన్సిక తన భర్తతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. అయితే ఈ మధ్యన సింగిల్ గా ఉన్న ఫొటోలు మాత్రమే పంచుకుంటోంది. ఇక ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసేది హన్సిక.  గతేడాది డిసెంబర్‌లో కూడా సెకండ్‌ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార. మరి  ఇంత కలివిడిగా ఉన్న ఈ ఆలుమగలు ఎందుకు విడిగా ఉంటున్నారు? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

హన్సిక లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

శారీలో యాపిల్ బ్యూటీ..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..