AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa OTT: ఓటీటీలోకి కన్నప్ప! మంచు విష్ణు, ప్రభాస్‌ల డివోషనల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ తారాగణంతో వచ్చిన డివోషనల్ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు గానే వసూళ్లు రాబట్టింది.ఇప్పడీ సినిమా ఓటీటీలోకి రానుంది.

Kannappa OTT: ఓటీటీలోకి కన్నప్ప! మంచు విష్ణు, ప్రభాస్‌ల డివోషనల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Kannappa Movie
Basha Shek
|

Updated on: Jul 21, 2025 | 7:36 AM

Share

పరమ శివుడు భక్తుడైన భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ఇందులో కన్నప్పగా కనిపించాడు. అలాగే సినిమాలో కీలకమైన రుద్ర పాత్రలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు. వీరితో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్  శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎంతో మంది ఈ డివోషనల్ మూవీలో నటించారు. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించారు. జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజైన కన్నప్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో మంచు విష్ణు నటన హైలెట్ గా నిలిచిందన్నారు. అలాగే ప్రభాస్ క్యామియో రోల్ కు కూడా ఆడియెన్స్ చేత విజిల్స్ పడ్డాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా కన్నప్ప సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రపతి భవన్ లోనూ ఈ డివోషనల్ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం.

థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన కన్నప్ప సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంనది తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రన్ కూడా ముగియడంతో త్వరలోనే కన్నప్ప మూవీ ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతుంది. జూలై 25 నుంచి కన్నప్ప చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి భవన్ తో కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
పేద ప్రజలకు సర్కార్ ఉగాది గిఫ్ట్‌.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!
పేద ప్రజలకు సర్కార్ ఉగాది గిఫ్ట్‌.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?
ఆ సినిమా దెబ్బకు అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిపోయా..
ఆ సినిమా దెబ్బకు అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిపోయా..
'టాక్సిక్' హీరో యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
'టాక్సిక్' హీరో యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
బీపి ఉన్నవారు పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా?
బీపి ఉన్నవారు పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా?
సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయంటే..
సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయంటే..
కారంగా ఉన్నా సూపర్.. పచ్చి మిరపకాయల పచ్చి నిజం ఇదే..
కారంగా ఉన్నా సూపర్.. పచ్చి మిరపకాయల పచ్చి నిజం ఇదే..
ఏది తిన్నా పొట్ట ఆయాసంతో అవస్థపడుతున్నారా..? ఈ చిట్కాలతో చిటికెలో
ఏది తిన్నా పొట్ట ఆయాసంతో అవస్థపడుతున్నారా..? ఈ చిట్కాలతో చిటికెలో