Vishal: 9ఏళ్లుగా ఎదురు చూశా.. ఇంక 2 నెలలు ఆగలేనా? విశాల్- సాయి ధన్సికల పెళ్లి వాయిదా! కారణమిదే
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, కబాలి హీరోయిన్ సాయి ధన్సికలు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్. అంతే కాదు త్వరలోనే పెళ్లి చూడా చేసుకోనున్నామంటూ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు..

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కేవాడు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్. హీరోయిన్ సాయి ధన్సికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టేవాడు. అయితే ఈ శుభకార్యానికి మరి కొంత సమయం పట్టేలా ఉందని తెలు్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సికను తన ప్రేయసిగా పరిచయం చేశాడు. ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నామంటూ వెడ్డింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో విశాల్ అభిమానులు కూడా తెగ సంతోష పడ్డారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై విశాల్ కూడా స్పందించాడు. ‘ సాయి ధన్సికతో నా పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే మా వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. నడిగర్ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశాను.ఇప్పుడు ఇంకో రెండు నెలలు ఆగలేనా? నడిగర్ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే. అందులో డౌటేమీ లేదు. ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు’ అని విశాల్ చెప్పుకొచ్చాడు.
కాగా నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం) భవన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జరుగుతోది. మొదట 2017లో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఈ భవన నిర్మాణం పూర్తవ్వడం లేదు. పదేపదే జాప్యాలను ఎదుర్కొంది. అయితే దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు విశాల్. మొత్తానికి ఈ కల అతి త్వరలోనే నెరవేరనుంది. ఇప్పుడు ఈ సంఘం భవంతి ప్రారంభోత్సవం కోసం విశాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చీరలో హీరోయిన్ సాయి ధన్సిక..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. గతంలో కంటే సినిమాలు తగ్గించేశాడు విశాల్. అతను చివరగా మదగజరాజ మూవీతో అలరించాడు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా డిటెక్టివ్ కు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








