OTT Movie: పోలీసులు ఇలా కూడా చేస్తారా? ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. మాలీవుడ్ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం

ఇప్పుడు మలయాళం సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ దక్కుతోంది. డిఫరెంట్ స్టోరీస్, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో అన్ని భాషల వారు ఈ సినిమాలను చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక మలయాళం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. తెలుగు ఆడియెన్స్ కు తగ్గట్టుగా తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు మరో మలయాళ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పోలీస్ వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈమూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. నై ట్ ప్యాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సీనియర్ పోలీస్ అధికారి యోహన్నన్ (దిలీప్ పోతన్)తో కలిసి సీపీవో దిన్నాతన్ (రోషన్ మాథ్యూ) రాత్రి ప్యాట్రోలింగ్ కు వెళతాడు. అలా వెళ్లిన వాళ్లకు సిటీలో ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. నగరంలో కొన్ని విషయాలు అబ్ నార్మల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి. చివరకు అది హత్య కేసు దాకా వెళ్తుంది.
పాము తన గుడ్లని తానే తినేసినట్లు.. అనుకోని పరిస్థితి వస్తే తోటి పోలీసుల్ని, పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తారు అన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు. సినిమా ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేరు. ఈ మలాయళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు రోంత్. అంటే తెలుగులో ‘రాత్రి గస్తీ’ అని అర్థం. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. మంచి సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారికి రోంత్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. అందుబాటులోకి తెలుగు వెర్షన్ కూడా..
#Ronth is now streaming exclusively on JioHotstar.@roshanmathew22 @vineetjaintimes @Jojo_Jose @JungleePictures @FestivalCinema @kalpesh_damani @mamtakamtikar @ish2203arora#Ronth #JioHotstar #JioHotstarMalayalam #RonthOnJioHotstar #PoliceStory #Thriller #Drama #MalayalamMovie pic.twitter.com/HmZ05IXiWu
— JioHotstar Malayalam (@JioHotstarMal) July 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








