Tollywood: చిన్నప్పుడే వైఎస్సార్ చేతుల మీదుగా నంది అవార్డు.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్.. ఎవరో గుర్తు పట్టారా?
సినిమా నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టడంతో ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నతనంలోనే బాలకృష్ణ, మహేష్ బాబు తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తన నటనా ప్రతిభకు ఏకంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు.

పై ఫొటోలో దివంగత సీఎం వైఎస్సార్, దాసరి నారాయణరావులతో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాక్టర్. సినిమా నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగాడు. దీంతో నటనపై మక్కువతో చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించాడు. తన నటనతో మెప్పించాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా అతను నటించిన ఒక సినిమాకు గానూ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. అప్పటికింకా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న అతను తన ఫ్రెండ్స్ తో కలిసి దివంగత మాజీ సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా ఈ నంది అవార్డు అందుకున్నాడు. కాగా మధ్యలో చదువు కారణంగా గ్యాప్ ఇచ్చినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో గా చాలా సినిమాలు చేశాడు.. నటనా పరంగా మంచి పేరు వచ్చింది కానీ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకున్నాడు. అంతే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. ఒకే ఒక్క సీరియల్ ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటిల్లి పాదికి అతనిని చేరువ చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు అయితే ఫేవరెట్ గా యాక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నాడు. ఇటీవల జబర్దస్త్ కామెడీ షోకు హోస్ట్ గానూ వచ్చాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ అతను మరెవరో కాదు బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగుల పల్లి.
బాల నటుడిగా కెరీర్ స్టార్ చేశాడు మానస్ . బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహనాయుడులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. అలాగే మహేష్ బాబు అర్జున్ సినిమాలోనూ నటించాడు. ఇక చిన్న పిల్లలతో తెరకెక్కించిన ‘హీరో’ సినిమాకు గానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు ను సొంతం చేసుకున్నాడు మానస్. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ప్రశంసా ప్రతాన్ని అందుకున్నాడు.
భార్యతో జబర్దస్త్ యాంకర్ మానస్..
View this post on Instagram
బుల్లితెరకు రాకముందు గోలి సోడా, ప్రేమికుడు,గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజ్ కాయ్, ఝలక్, గ్రీన్ సిగ్నల్, ఊరెల్లిపోతా మామ, 5జి లవ్ తదితర సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించాడు. బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెర స్టార్ గా మారిపోయాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








