Bigg Boss Telugu Season 9: పెళ్లయ్యి 8 నెలలే అయ్యింది.. మా ఆయన బిగ్ బాస్ కు వెళ్లొద్దన్నాడు.. కానీ..
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే షురూ కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ కోసం ముస్తాబవుతోంది. గతంలో కంటే భిన్నంగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సర్ ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయనున్నారని సమాచారం.

బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 8 సీజన్లు పూర్తి కాగా, తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మరిన్ని హంగులు, సర్ ప్రైజ్ లతో బిగ్ బాస్ షో ముస్తాబవుతున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో కూడా కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఎనిమిదో సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రేరణ కూడా ఒకరు. అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన ఆమె బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో ఫినాలే వరకు వెళ్లింది. . త్రుటిలో టైటిల్ మిస్ అయ్యింది. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజి బిజీగా ఉంటోన్న ప్రేరణ తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే బిగ్ బాస్ అనుభవం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘ నాకు పెళ్లయిన 8 నెలలకే బిగ్ బాస్ సీజన్ 8 ఛాన్స్ వచ్చింది. ఒకవేళ ఫైనల్ వరకు ఆడినా మూడు నుంచి నాలుగు నెలలు నన్ను వదిలేసి వెళ్లిపోతావా? అని మా ఆయన తీవ్రంగా బాధ పడ్డారు. బిగ్ బాస్ కు వెళ్లొద్దు అన్నారు. పెళ్లయ్యాక మొదటిసారి వచ్చే మా బర్త్ డేలు, ఫస్ట్ పండగలు, వెడ్డింగ్ యానిర్స్ డేలు.. అన్ని వదిలేసుకోవాలి అని ఆవేదన చెందారు. కానీ నేను మాత్రం ఇప్పుడు వచ్చింది చేసేద్దాం అని అనుకున్నా. ఇప్పుడు ఛాన్స్ వదిలేస్తే భవిష్యత్ లో మళ్లీ వస్తుందో రాదో అని నా భయం. నేను బిగ్ బాస్ కి వెళ్లాలి అని, వద్దని మా ఆయన గొడవ పడ్డాం. ఈ విషయం కారణంగా మా ఆయన మూడు నాలుగు రోజులు నాతో మాట్లాడలేదు కూడా’
టీవీ షోలో ప్రేరణ..
View this post on Instagram
‘నేనేమో హౌస్ లోకి వస్తానని ఒప్పేసుకున్నాను. మళ్లీ వద్దంటే ప్రొఫెషనల్ గా బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా స్ట్రాంగ్ గా వెళ్లాల్సిన సమయంలో ఆయన వద్దు అన్నారు. నాతో మాట్లాడటం మానేయడంతో నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ బిగ్ బాస్ కి వెళ్లే ఒక రెండు రోజుల ముందు నైట్ అంతా కూర్చొని ఆయనతో మాట్లాడి ఒప్పించాను. ఆ తెల్లారి నుంచి నా మావారు నాతో మళ్లీ మాములుగా మాట్లాడారు. నేను బిగ్ బాస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఆయనే బయట ఉండి నాకు సపోర్ట్ చేసారు’ అని ప్రేరణ చెప్పుకొచ్చింది.
భర్తతో కలిసి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








