Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి సీరియల్ బ్యూటీ.. వంటలక్క తర్వాత బుల్లితెరపై ఆ రేంజ్ ఫాలోయింగ్ ఈ అందాల తారకే
తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లోనూ బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. తెలుగు సీజన్ విషయానికి వస్తే.. ఇప్పటికే ప్రోమోలు కూడా రిలీజయ్యాయి. అలాగే కంటెస్టెంట్ల లిస్టులు కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఓ బుల్లితెర సెన్సేషన్ కూడా ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లో త్వరలోనే ఈ రియాలిటీ షో సందడి ప్రారంభం కానుంది. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ల కంటే ఈసారి మరిన్ని హంగులు, సర్ ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం. దాదాపు మూడు నెలల పాటు జరిగే ఈ రియాలిటీ గేమ్ షో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు వచ్చిందని టాక్. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల తో పాటు కామన్ మ్యాన్ లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్లు వీరే నంటూ సోషల్ మీడియాలో పలు జాబితాలు కనిపిస్తున్నాయి. కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ బుల్లితెర సెన్సేషన్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. మొదటి నుంచి ఈ అందాల తార పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ లో వేదశ్వినిగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పించిది బెంగాలీ బ్యూటీ దేబ్‌జాని మోదక్.
ఇటీవల ఏ టీవీ షో చూసినా దేబ్ జానీనే కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ గురించే చర్చ. దీంతో ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో దేబ్ జానీ కచ్చితంగా ఉండనుందని తెలుస్తోంది. బెంగాల్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో పలు బెంగాలీ సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో డాక్టర్ వేదశ్వినిగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఆ తర్వాత సత్యభామ సీరియల్ లో నటించింది. ప్రస్తుతం బంగారు చెల్లెలు ధారావాహికతో బిజి బిజీగా ఉంటోంది.
దేబ్ జానీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
View this post on Instagram
ఈ మధ్యన సీరియల్స్ తో పాటు పలు టీవీషోల్లోనూ సందడి చేస్తోంది దేబ్ జానీ. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బుల్లితెరపై వంటలక్క తర్వాత దేబ్ జానీకే ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ఈ బ్యూటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
దేబ్ జానీ బ్యూటిఫుల్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








