Salman Khan: 200 గ్రామాలను దత్తత తీసుకుని కరువును తరిమికొట్టిన హీరో.. ఏం చేశాడంటే..
పాన్ ఇండియా లెవల్లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో అతడు ఒకరు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేశారు. అంతేకాదు.. అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న స్టార్. ఇప్పటికీ బ్యాక్ బ్యాక్ సినిమాలతో మెప్పిస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతడి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమంలో చేయడంలో ముందు ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మందికి తనవంతూ సాయం చేశారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆ హీరో.. దాదాపు 200 గ్రామాలను దత్తత తీసుకున్నాడు. 2019లో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తినప్పుడు.. ఈ హీరో ముందుకు వచ్చారు. గురుగ్రామ్‌లోని ఎలాన్ గ్రూప్‌తో కలిసి, కొల్హాపూర్‌లోని ఖిద్రాపూర్ గ్రామాన్ని పునర్నిర్మించడానికి సహాయం చేశాడు. ఆ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.
సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఎన్జీఓ, బీయింగ్ హ్యూమన్, కష్టాల్లో ఉన్న వర్గాలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. నివేదికల ప్రకారం మహారాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతాలలో సల్మాన్ కు సంబంధించిన ఫౌండేషన్ 200 గ్రామాలను దత్తత తీసుకుని.. మరాఠ్వాడ ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం అందించడానికి దాదాపు 2500 నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. 2019లో, వరదలు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను నాశనం చేసినప్పుడు, సల్మాన్ మరోసారి ముందుకు వచ్చాడు. గురుగ్రామ్‌లోని ఎలాన్ గ్రూప్‌తో కలిసి, కొల్హాపూర్‌లోని ఖిద్రాపూర్ గ్రామాన్ని పునర్నిర్మించడంలో సహాయం చేశాడు. ఈ విషయం గురించి తన ఇన్ స్టాలోనూ ప్రస్తావించారు.
“2019 వరద ప్రభావిత మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఖిద్రాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ELAN గ్రూప్ వారి నిజాయితీ, గొప్ప పనికి నా శుభాకాంక్షలు.వీరు తమ ఇళ్లను పునర్నిర్మించడానికి మహారాష్ట్రలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.” అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








