Tollywood: ఒకప్పుడు సెలూన్ షాపులో పని.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అండ్ సింగర్.. ఎవరో గుర్తు పట్టారా?
చాలా మంది స్టార్స్ అయ్యాక తమ మూలాలను మర్చిపోతుంటారు. కానీ ఇతను మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడకు వెళ్లినా తన కుల వృత్తి గురించి గొప్పగా చెబుతాడు. తాను చిన్నప్పుడు తండ్రితో కలిసి సెలూన్ షాపులో పనిచేశానని గర్వంగా చెప్పుకుంటాడు. ఇదే అతనికి బోలెడంత అభిమానులను తెచ్చిపెట్టింది.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. హైదరాబాద్ లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. సెలూన్ షాపు నుంచి తన ప్రయాణం మొదలు పెట్టాడు. చిన్నప్పుడే తన తండ్రితో కలిసి బార్బర్ షాప్ లోనే పని చేశాడు. అదే సమయంలో సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెల పై కర్రలతో వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పాడడం అలవాటు చేసుకున్నాడు. దీనిని గమనించిన ఆ తండ్రి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తన కుమారుడికి గజల్ సింగర్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించాడు. అక్కడ సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొన్న అతను గజల్స్‌పై మంచి పట్టు సాధించాడు. ఓవైపు బార్బర్ షాపులో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలతో యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు. తన హుషారైన మాస్, ఫోక్ సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ను ఉర్రూతలూగించాడు. స్టార్ హీరోల సినిమాల్లోనూ పాటలు ఆలపిస్తూ స్టార్ సింగర్ గా ఎదిగాడు. ఆఖరికి చాలా మందికి సాధ్యం కాని ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదిక పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేజ్ కు ఎదిగాడు. హైదరాబాద్ పాత బస్తీ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. యస్ అతనెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.. పై ఫొటోలో ఉన్నది సింగర్, నటుడు, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ,
బోనాల పండగ సందర్భంగా రాహుల్‌కి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైదరాబాదీ సింగర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్థానం ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆస్కార్ వేదిక వరకూ వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు’ అని రాహుల్ ను కొనియాడారు. దీంతో మరోసారి ఈ సింగర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. రాహుల్ చిన్నప్పటి ఫొటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి..
బోనాల సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా – ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
Rahul Sipligunj Receives ₹1 Crore Bonalu Honor – CM Revanth Keeps His Promise
హైదరాబాద్ బోనాల సందర్భంగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను… pic.twitter.com/xBMvOe4FZs
— Congress for Telangana (@Congress4TS) July 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








