Cinema : క్షణక్షణం ఉత్కంఠ.. పెద్ద హీరోహీరోయిన్స్ లేరు.. గ్లామర్ పాటలు లేవు.. ఓటీటీని ఊపేస్తోన్న థ్రిల్లర్ మూవీ..
క్షణ క్షణం ఉత్కంఠతో.. ఊహించని మలుపులతో సాగే థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈమధ్య కాలంలో ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తెగ విడుదలవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా గురించి తెలుసా.. ? ప్రతి క్షణం ప్రేక్షకులను సీటుపై కూర్చోబెట్టే ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టదు.

ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో నకిలీ వార్తలు, క్రూర మనస్తత్వం ఎటువంటి కారణం లేకుండా కొంతమంది ప్రాణాలను ఎలా బలిగొంటాయో చెప్పడానికి ఈ చిత్రం ఉత్తమ ఉదాహరణ. 2023లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. భారతదేశంలో వాట్సాప్, ఫేక్ వార్తలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని వాస్తవ సంఘటనలతో కలిపి చెప్పే ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి. దాదాపు 1 గంట 32 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ‘స్టోలెన్’. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
కథ విషయానికి వస్తే.. ఝుంపా (మియా మెల్జర్) అనే పేద కార్మికురాలు తన 5 నెలల కుమార్తెతో స్టేషన్ బెంచ్ మీద నిద్రిస్తుంటుంది. విమానం మిస్ అయి రైలులో వస్తున్న తన సోదరుడు రామన్ (శుభం వర్ధన్)ను తీసుకెళ్లడానికి గౌతమ్ (అభిషేక్ బెనర్జీ) వచ్చాడు. అయితే అదే రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని స్త్రీ ఝుంపా కుమార్తెను కిడ్నాప్ చేస్తుంది. రామన్ వేదికపై ఉండటం వల్ల తన కుమార్తె అదృశ్యంలో అతని హస్తం ఉండవచ్చని ఝుంప అనుమానిస్తుంది. ఝుంపాకు రామన్ తో గొడవ జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి అదృశ్యంలో రామన్ పాత్ర లేదని స్పష్టమవుతుంది. కానీ గౌతమ్, రామన్ లను స్టేషన్ లో ఆపేస్తారు. ఇంతలో ఝుంప టీ అమ్మే వ్యక్తిని అనుమానిస్తుంది. అసలు చిన్నారిని ఎవరు కిడ్నాప్ చేసారు? దీని వెనుక ఉన్న సమస్యలు ఏమిటి? అక్కడ ఏం జరిగింది? చిన్నారిని రక్షించారా లేదా అనేది ‘స్టోలెన్’ సినిమా మిగిలిన కథ.
ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ, శుభం వర్ధన్, మియా మల్సేర్ ప్రధాన పాత్రలు పోషించారు. 2018లో బీహార్‌కు చెందిన ఐదుగురు పిల్లలను కిడ్నాప్ చేసేవారు అస్సాం రాష్ట్రంలోని కర్బి గ్రామంలోకి ప్రవేశించారనే నకిలీ వార్త వాట్సాప్, సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ చిత్రం నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. నిజం లేదా అబద్ధం తెలియకుండా సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారాన్ని ప్రజలు నమ్మినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఈ సినిమా. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








