Singer: తెలుగులో టాప్ సింగర్.. అందంలోనూ అద్భుతమే.. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సింగర్ త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్. అద్భుతమైన గాత్రంతో మెస్మరైజ్ చేస్తుంది. ఎన్నో సూపర్ హిట్ పాటలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

తెలుగు సినిమా ప్రపంచంలో సింగర్స్ కు కొదవ లేదు. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన పాడుతా తీయగా సింగింగ్ షో ద్వారా ఎంతో మంది గాయనీగాయకులు కళామతల్లికి పరిచయమయ్యారు. దశాబ్దాలుగా బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్న ఈ షో.. ఇప్పటివరకు ఎంతమందిని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది. అద్భుతమైన గాత్రం.. ప్రతిభ ఉండి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది గాయనీగాయకులకు వేదికగా నిలిచింది పాడుతా తీయగా. ఇక ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి సైతం ఈ షో ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరోతెలుసా.. ? తనే రమ్య బెహరా.
1994 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించింది రమ్య. కానీ చిన్నప్పటి నుంచి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. చిన్నతనంలోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా పలు సింగింగ్ కాంపిటీషన్లలో పాల్గొని మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. బాలు, కీరవాణి ప్రశంసలు అందుకుంది. టీవీ ప్రొగ్రామ్స్, విదేశాల్లో సంగీత కచేరిల్లో పాల్గొంటూ.. మధురమైన గాత్రంతో అలరిస్తున్న రమ్యను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం కీరవాణి. వెంగమాంబ సినిమాలోని పాటలతో గాయనిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, ప్రేమకథా చిత్రమ్, రంగ్ దే, స్కంద వంటి చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో ఎన్నో పాటలు పాడింది. రమ్య బెహారాకు గాత్రానికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే అందంలోనూ ఆమెకు సాటిలేరు. పద్దతిగా, సంప్రదాయ లుక్ లో కనిపిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది.
View this post on Instagram
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..




