- Telugu News Photo Gallery Cinema photos Actress Kajol Remembers Her film journey and Comments About Her Looks
Tollywood : నల్లగా ఉన్నావ్.. నువ్వు హీరోయిన్ ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..
సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం కెరీర్ తొలినాళ్లల్లోనే అవమానాలు భరించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..
Updated on: Jul 22, 2025 | 2:12 PM

ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికలలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తక్కువ సమంయలోనే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. ఇంతకు ఆమె ఎవరంటే.

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో తనను కొంతమంది నల్లగా ఉన్నానని.. లావుగా ఉన్నానని ఎగతాళి చేశారని.. నువ్వు హీరోయిన్ ఏంటీ అంటూ వెక్కిరించారని.. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో తన ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయానని.. అందరూ అవమానిస్తుంటే భరించలేకపోయానని తెలిపింది. నెమ్మదిగా తనపై తాను శ్రద్ధ వహిస్తూ..జాగ్రత్తలు తీసుకోవడం గ్లామర్ లో మార్పు వచ్చిందని.. దీంతో తాను సర్జరీ చేయించుకున్నానే ప్రచారం జరిగిందని తెలిపింది.




