- Telugu News Photo Gallery Cinema photos Know Silk Smitha Half Bitten Apple Was Sold For 26 Thousand Rupees
Silk Smitha : సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్.. వేలం వేస్తే ఎంతకు తీసుకున్నారో తెలుసా.. ?
సిల్వర్ స్క్రీన్ పై ఆమె ఓ సంచలనం. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి చెన్నై చేరుకున్న ఓ సాధారణ అమ్మాయి.. ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగింది. నటిగా, డాన్సర్ గా సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని రూపం.
Updated on: Jul 22, 2025 | 1:45 PM

సిల్క్ స్మిత.. సినీరంగంలో చెరగని అందమైన రూపం. మత్కెక్కించే కళ్లు.. చూడచక్కని సౌందర్యంతో అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను ఆకర్షించింది. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం. సిల్క్ స్మిత ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అనే రేంజ్ లో ఆమె స్టార్ డమ్ సంపాదించుకుంది.

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు.. అప్పట్లో కుర్రాళ్ల మనసులు గెలిచిన లేడీ సూపర్ స్టార్. ఒక్కో పాటకు అగ్ర హీరోలకు మించిన పారితోషికం తీసుకున్న ఏకైన హీరోయిన్. సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్ ఉందంటే చాలా నిర్మాతలు కలెక్షన్స్ విషయం ఊపిరి పీల్చుకునేవాళ్లు.

సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్స్, పెద్ద పెద్ద దర్శకనిర్మాతలు సైతం ఎదురుచూసేవాళలు. ఒకటిన్నర దశాబ్దంకు పైగా అందం, అభినయంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత అర్థాంతరంగా తనువు చాలించారు. ఒకప్పుడు ఆమె అగ్ర తార.

1984లో ఒక సినిమా షూటింగ్ సెట్ లో సిల్క్ స్మిత యాపిల్ తింటుండగా.. షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట. దీంతో యాపిల్ అక్కడే వదిలి షూట్ కోసం వెళ్లిపోయారట. ఆ సగం తిన్న యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీ పడ్డారట.

1984లో ఒక సినిమా షూటింగ్ సెట్ లో సిల్క్ స్మిత యాపిల్ తింటుండగా.. షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట. దీంతో యాపిల్ అక్కడే వదిలి షూట్ కోసం వెళ్లిపోయారట. ఆ సగం తిన్న యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీ పడ్డారట.




