- Telugu News Photo Gallery Cinema photos Do you Know This Serial actress, who is Famous With Villian Role On TV, She Is Brahmamudi Serial Fame Sharmitha Gowda
Serial Actress: అబ్బబ్బో అరాచకమే.. సీరియల్ బ్యూటీ అందాల సునామీ.. గ్లామర్ ఫోజులతో ఆగం చేస్తోందిగా..
బుల్లితెరపై విలన్ పాత్రలతో ఫుల్లుగా ఫేమస్ అయ్యింది. పవర్ ఫుల్, కన్నింగ్ విలన్ గా అద్భుతమైన నటనతో అలరిస్తుంది. మరోవైపు గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తోంది. సీరియల్స్ లో ట్రెండింగ్.. అటు నెట్టింట క్రేజీ ఫోటోలతో మాయ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..
Updated on: Jul 22, 2025 | 1:14 PM

రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ. తెలుగు బుల్లితెర సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదంచుకుంది. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తూ తనదైన ముద్ర వేసింది ఈ అమ్మడు.

బ్రహ్మాముడి సీరియల్లో రాజ్, కావ్యలతోపాటు రుద్రాణి పాత్రకు సైతం అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చీరకట్టులో కనిపిస్తూనే గ్లామర్ టచ్ ఇస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

నిజానికి షర్మిత గౌడ కన్నడ సీరియల్ నటి. ఇప్పటివరకు కన్నడలో అనేక సీరియల్స్ చేసింది. బ్రహ్మాముడి సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైంది. నెగిటివ్ పాత్రలో రఫ్పాడిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.

తాజాగా చీరకట్టులో ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. విలన్ పాత్రలో హీరోకు అత్తగా నటిస్తూనే హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే స్నేహితులతో కలిసి వేకేషన్ ఎంజాయ్ చేస్తున్న పోస్టులు సైతం నెట్టింట వైరలవుతున్నాయి.

షర్మిత గౌడ వయసు కేవలం 32 సంవత్సరాలు. కానీ చిన్న వయసులోనే అత్త, అక్క, వదిన పాత్రలు పోషిస్తుంది. ఇప్పటివరకు కన్నడలో అలరించిన ఆమె.. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు సినీప్రియులకు ఇష్టమైన నటిగా మారింది.




