Junior: కలెక్షన్లతో సత్తా చాటుతున్న కిరిటీ.. రికార్డ్స్ తిరగరాస్తున్న జూనియర్..
హీరోగా ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయ్యాడు కిరీటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన జూనియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగుతోపాటు కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

రాజకీయ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జూనియర్. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. చాలా కాలం తర్వాత హీరోయిన్ జెనీలియా కీలకపాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా యాక్టింగ్, డ్యాన్స్ లో కిరీటి ప్రదర్శన బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తెలుగుతోపాటు, కన్నడలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కర్ణాటకలో జూనియర్, ఎక్క సినిమాలు విజయవంతంగా దూసుకుపోతున్నాయి. కన్నడలో రెండు మంచి వసూళ్లు సాధించాయని సమాచారం.
‘జూనియర్’ సినిమాతో కిరీటికి అపూర్వమైన ఓపెనింగ్ వచ్చింది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై ప్రశంసలు అందుకుంది. మంగళవారం వసూళ్లు కూడా కలిపితే ఈ సినిమా రూ. 7 కోట్లు వసూలు చేసింది. మంగళవారం (జూలై 22) ఈ సినిమా దాదాపు రూ. 60-80 లక్షలు వసూలు చేసిందని సమాచారం. ‘జూనియర్’ వసూలు చేసిన 7 కోట్ల రూపాయలలో, కర్ణాటక నుండి దాదాపు 1 కోటి రూపాయలు రాబట్టింది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
ఇక ‘ఎక్కా’ సినిమా కలెక్షన్ కూడా దాదాపు రూ.7 కోట్లు. మంగళవారం (జూలై 22) సినిమా కచ్చితమైన వసూళ్లు ఇంకా అందుబాటులో లేవు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ సినిమా దాదాపు రూ.60 లక్షలు రాబట్టింది. దీని గురించి నిర్మాతల నుండి అధికారిక సమాచారం ఇంకా అందలేదు.
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








